మంగళవారం, ఫిబ్రవరి 04, 2020

హల్లో మేడం సత్యభామా..

లేత మనసులు చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లేత మనసులు (1966)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథన్ 
సాహిత్యం : దాశరధి
గానం : పి.బి.శ్రీనివాస్, పిఠాపురం  

హల్లో మేడం సత్యభామా
పైనకోపం లోన ప్రేమా
నీవు నేను ఏకమైతె స్వర్గలోకం
నీవులేని జీవితమే పెద్ద శాపం

love love love love bow bow bow
sunday picture, monday beach
tuesday circus, wednesday drama
Do Do Do Do Do భామా..
మనం ప్రేమ యాత్ర వెళ్ళుదామా...

హల్లో మేడం సత్యభామా..భామా
పైనకోపం లోన ప్రేమా...ప్రేమా
నీవు నేను ఏకమైతె స్వర్గలోకం...లోకం
నీవులేని జీవితమే పెద్ద శాపం...

love love love love bow bow bow

ఇంకా బిడియమేలా... ఏలా
నన్నే నమ్మలేవా... లేవా
నాపై జాలి రాదా... రాదా
హౄదయం విప్పరాదా

లా..లా..లా..లా..లా..లా..
లా..లా..లా..లా..లా..లా

దైవం ఏమిచేసే...చేసే..
స్త్రీనే సృష్టి చేసే...చేసే..
స్త్రీనే సృష్టి చేసి...చేసి
మాపై విసిరివేసే....
లా..లా..లా..లా..లా..లా..
లా..లా..లా..లా..లా..లా

sunday picture, monday beach
tuesday circus, wednesday drama

Do Do Do Do Do భామా..
మనం ప్రేమ యాత్ర వెళ్ళుదామా...

హల్లో మేడం సత్యభామా..భామా
పైనకోపం లోన ప్రేమా...ప్రేమా
నీవు నేను ఏకమైతె స్వర్గలోకం...లోకం
నీవులేని జీవితమే పెద్ద శాపం...

love love love love bow bow bow

హంసా లాంటి వాకింగ్...వాకింగ్
హల్వా వంటి టాకింగ్...టాకింగ్
చాలూ చాలు కాలేజ్..కాలేజ్
చేస్కో..ఇంక మారేజ్....

అమ్మాయ్ గారి మౌనం...మౌనం
తెలిసే..మాకు అర్థం...అర్థం
మదిలో వున్నమాట...మాట
కనులే..పలుకునంటా...
లా..లా..లా..లా..లా..లా..
లా..లా..లా..లా..లా..లా

sunday picture, monday beach,
tuesday circus, wednesday drama

Do Do Do Do Do భామా..
మనం ప్రేమ యాత్ర వెళ్ళుదామా...

హల్లో మేడం సత్యభామా..భామా
పైనకోపం లోన ప్రేమా...ప్రేమా
నువ్వు నేను ఏకమైతె స్వర్గలోకం...లోకం
నీవులేని జీవితమే పెద్ద శాపం

love love love love bow bow bow
 

4 comments:

This is a trendsetter song. A peppy song composed in shivaranjani ragam mostly used for pathos.

థాంక్స్ ఫర్ ద కామెంట్ అజ్ఞాత గారు.. ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ అండీ..

ఇలా టీజ్ చేస్తే కోపమే రాదు..

హహహ అంతేనంటారా :-) థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.