ఆదివారం, ఫిబ్రవరి 09, 2020

చెలికాడు నిన్నే...

ఎస్.రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో సినారె గారు రచించిన ఒక సరదా అయిన ఆపాతమధురం ఈ రోజు మీకోసం... చూసి వినీ ఆస్వాదించండి. ఈ పాట ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కులగోత్రాలు (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం: ఘంటసాల, సుశీల

చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
నన్నే తెలుపమంటావా..

చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..

నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ...
నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
అహహా ...అహా ఒహోహో ....
అహహా ఒహో ......అ ఆ

చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..

నీ అందమే శ్రీగంధమై నా డెందమలరించే
నీ రూపె దీపమ్మై ప్రియా నా చూపుల వెలిగించే
అహహా ... అహా ఒహోహో .....
అహహా ఒహో.......అ ఆ ...

చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..

నీ తోడుగా నడయాడగా ఇంకేమి కావాలీ
మధురానురాగాలే ఫలించే తరుణం రావాలీ
అహహా...అహా ఒహోహో....
హహా ఒహో...అ ఆ . .

చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
నన్నే తెలుపమంటావా.. 


4 comments:

మంచి పాట. రాజేశ్వరరావు గారి బాణీలు విలక్షణంగా ఉంటాయి. వినడానికి హాయిగా వినసొంపుగా ఉంటాయి. కానీ పాడటం అంత తేలిక కాదు. అనూహ్యం గా మారుతూ అద్భుతంగా ఉంటాయి. అతి గొప్ప సంగీత దర్శకుడు అన్నమాట నిండు నిజం.

చిన్ని చిన్ని మాటలలో..అందమైన భావాలు

అవును శాంతి గారు సినారె గారి మ్యాజిక్.. థాంక్స్ ఫర్ ద కామెంట్ అండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.