శనివారం, ఫిబ్రవరి 01, 2020

నన్ను వదలి నీవు పోలేవులే..

ఫిబ్రవరి అంటే ప్రేమికుల దినోత్సవం గుర్తొస్తుంది కనుక ఈ నెలంతా బ్లాక్ అండ్ వైట్ రోజులలో వచ్చిన అందమైన ప్రేమ గీతాలను తల్చుకుందాం. ముందుగా మహదేవన్ గారు స్వరపరచిన మంచిమనసులు చిత్రంలోని ఓ చక్కని పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియోను ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మంచి మనసులు (1962)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, సుశీల

నన్ను వదలి నీవు పోలేవులే.. అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే
నన్ను వదలి నీవు పోలేవులే.. అది నిజములే..ఏ..ఏ..
పూవులేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే ...

తావిలేని పూవు విలువ లేనిదే .. ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే
తావిలేని పూవు విలువ లేనిదే .. ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే

నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
దూరదూర తీరాలు చేరువైపోయె..ఓ..ఓ..

తావిలేని పూవు విలువ లేనిదే ..ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే

సిగ్గుతెరలలో కనులు దించుకొని.. తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ...
సిగ్గుతెరలలో కనులు దించుకొని.. తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ...
రంగులీను నీ మెడలో బంగారపు తాళిగట్టి
పొంగిపోవు శుభదినము రానున్నదిలే..
ఓ…

నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే

తొలినాటి రేయి తడబాటు పడుతూ
మెల్లమెల్లగా నీవు రాగా...
నీ మేని హొయలూ నీలోని వగలూ...
నాలోన గిలిగింతలిడగా
హృదయాలు కలసీ ఉయ్యాలలూగీ...
ఆకాశమే అందుకొనగా..ఆ..ఆ..
పైపైకి సాగే మేఘాలదాటి..
కనరాని లోకాలు కనగా...

ఆహా ఓహో ఉహు...ఆ… ఆ…ఓ…
నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే
నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే2 comments:

ఇలా పాడితే యెవరూ వదిలి పోలేరు మరి..

హహహహ బాగా చెప్పారు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.