సోమవారం, మార్చి 09, 2020

హరివిల్లే వరదల్లే ఇలపైకి...

మిత్రులందరకూ హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మహానగరంలో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మహానగరంలో (2008)
సంగీతం : కోటి
సాహిత్యం : చంద్రబోస్
గానం : కారుణ్య, సునీత  

హరివిల్లే వరదల్లే ఇలపైకే
దిగివచ్చే సింగారంగా రంగల్లే
విరిజల్లే వరమల్లే ఎదలోకే
ఎదురొచ్చే వైభోగంగా గంగల్లే

రంగులన్నీ చల్లుకుందామా ఈ పండుగరోజు
చెంగుమంటూ చిందులేద్దామా
నింగి దాటి పొంగిపోదామా ఈ సందడిరోజు
ముంగిలంతా ముగ్గులేద్దామా

కళ్ళల్లో స్వప్నాలే కదిలొచ్చే ఈ రోజు
గుండెల్లో స్వర్గాలే కబురిచ్చే ఈ రోజు
ఆడుకుందాం హోలీ హోలీ రంగోలీ
పాడుకుందాం కేళీ కేళీ ఖవ్వాలీ
ఆడుకుందాం హోలీ హోలీ రంగోలీ
పాడుకుందాం కేళీ కేళీ ఖవ్వాలీ

హరివిల్లే వరదల్లే ఇలపైకే
దిగివచ్చే సింగారంగా రంగల్లే
విరిజల్లే వరమల్లే ఎదలోకే
ఎదురొచ్చే వైభోగంగా గంగల్లే

నవ్వే తెలుపంట చూపే ఎరుపంటా
నీలో నాలో ఆశల రంగే ఆకుల పచ్చంటా
నీడే నలుపంటా ఈడే పసుపంటా
లోలో దాగే ఊహలపొంగే ఊదారంగంటా
లోకంలో వర్ణాలన్నీ కలిసున్నాయి మనలో
ఏకంగా కదలాలో
శోకాలే సంతోషాలే కొలువుంటాయి మదిలో
రంగ్‌దే రంగ్‌దే రంగ్‌దే...

రంగులన్నీ చల్లుకుందామా ఈ పండుగరోజు
చెంగుమంటూ చిందులేద్దామా
నింగి దాటి పొంగిపోదామా ఈ సందడిరోజు
ముంగిలంతా ముగ్గులేద్దామా

మోసం నిలవదుగా ద్రోహం మిగలదుగా
ఏనాడైనా అన్యాయానికి న్యాయం జరగదుగా
పంతం చెదరదుగా ఫలితం దొరికెనుగా
ఏ రోజైనా మంచికి చెడుపై విజయం తప్పదుగా
ఆలోచన బీజం వేసి చెమటే నీరుగ పోసి
ఆవేశం ఎరువేసి
పని చేస్తే పండేనంట ఆనందాలరాశీ
రంగ్‌దే రంగ్‌దే రంగ్‌దే...

రంగులన్నీ చల్లుకుందామా ఈ పండుగరోజు
చెంగుమంటూ చిందులేద్దామా
నింగి దాటి పొంగిపోదామా ఈ సందడిరోజు
ముంగిలంతా ముగ్గులేద్దామా

కళ్ళల్లో స్వప్నాలే కదిలొచ్చే ఈ రోజు
గుండెల్లో స్వర్గాలే కబురిచ్చే ఈ రోజు
ఆడుకుందాం హోలీ హోలీ రంగోలీ
పాడుకుందాం కేళీ కేళీ ఖవ్వాలీ
ఆడుకుందాం హోలీ హోలీ రంగోలీ
పాడుకుందాం కేళీ కేళీ ఖవ్వాలీ 
 

2 comments:

బిలేటెడ్ హోలి విషెస్ అండీ..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.. మీక్కూడా హోలీ శుభాకాంక్షలు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.