లేతమనసులు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : లేత మనసులు (1966)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : సుశీల
పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...
పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం...
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం...
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం...
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం...
పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...
పుట్టినపుడు మనిషి మనసు తెరిచి ఉండును...
పుట్టినపుడు మనిషి మనసు తెరిచి ఉండును...
ఆ పురిటి కందు మనసులో దైవముండును...
ఆ పురిటి కందు మనసులో దైవముండును...
వయసు పెరిగి ఈసు కలిగి.. మదము హెచ్చితే...
వయసు పెరిగి ఈసు కలిగి.. మదము హెచ్చితే...
అంత మనిషిలోని దేవుడే మాయమగునులే...
అంత మనిషిలోని దేవుడే మాయమగునులే...
పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...
వెలుగుతున్న సూర్యుణ్ణి.. మబ్బు మూయును...
వెలుగుతున్న సూర్యుణ్ణి.. మబ్బు మూయును...
మనిషి తెలివి అనే సూర్యుణ్ణి.. కోపం మూయును...
మనిషి తెలివి అనే సూర్యుణ్ణి.. కోపం మూయును...
గాలి వీచ మబ్బు తెరలు కదలిపొవులే...
గాలి వీచ మబ్బు తెరలు కదలిపొవులే...
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే..
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే..
పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు...
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు...
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు...
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు...
మాయమర్మమేమి లేని బాలలందరు...
మాయమర్మమేమి లేని బాలలందరు...
ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే...
ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే...
పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం...
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం...
పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...
2 comments:
పిల్లల పాటల సిరీస్ అంటే ఈ పాట లేకుండా పూర్తి కాదేమో..
హహహ అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.