మంగళవారం, మార్చి 03, 2020

ఆడీ చదువుకో నువ్వు..

యజమాని చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : యజమాని (1972)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథన్
సాహిత్యం :
గానం : బాలు, సుశీల

ఆడీ చదువుకొ నువ్వు.. అలాగే..
ఆశలు మనసున నిలుపు.. అలాగా..
ఆడీ చదువుకొ నువ్వు.. అలాగే..
ఆశలు మనసున నిలుపు.. అలాగా..
లక్ష్యం నీలో ఉంచూ.. సరే..
అనుకుంది నువ్వు సాధించు..సాధిస్తాం..
లక్ష్యం నీలో ఉంచూ.. సరే..
అనుకుంది నువ్వు సాధించు.. సాధిస్తాం..

ఆడీ చదువుకొ నువ్వు
ఆశలు మనసున నిలుపు

ఒకటీ ఒకటీ రెండు.. రెండూ..
ఒకరికి ఒకరు సరి జోడు.. సరి జోడూ..
ఒకటీ ఒకటీ రెండు.. రెండూ..
ఒకరికి ఒకరు సరి జోడు.. సరి జోడూ..
ఎన్నెన్నొ కోరికలున్నా.. ఉన్నా..
హాయిగ చదవాలంటున్నా.. చదివేస్తాం..  

లాల్లల లాల్లాల లలలల్లా

అ ఆ లు విడిగా ఉంటున్నా.. ఉంటున్నా..
కలిసొకటైతే పదం .. పదం..
అ ఆ లు విడిగా ఉంటున్నా.. ఉంటున్నా..
కలిసొకటైతే పదం .. పదం..
కవితకు మూలం అక్షరము.. అక్షరం.. 
అందించునులే సౌందరం.. సౌందర్యం..
అర్ధమైందా.. అయ్యిందీ..

ఒకటీ ఒకటీ రెండూ.. 
ఒకరికి ఒకరు తోడు..
లాల్లా..లాలలలాల్లా..

లోలోనా ఏముందో తెలుసునులే
నిజం తెలుపక నవ్వెనులే
లోలోనా ఏముందో తెలుసునులే
నిజం తెలుపక నవ్వెనులే
మౌనంగా తన మనసే తెలిపెనులే
కల్పనలోనా ఇంకా బతకొద్దనీ
 
తియ్యని రేపటి జీవితము
విరిసిన వెన్నెలగా నిలుచును
తియ్యని రేపటి జీవితము
విరిసిన వెన్నెలగా నిలుచును
కరుణించి ప్రేమను పంచునని
కన్నులతో కథలెన్నో చెప్పెనులే

నీలో ఉన్నది ఏదో
ఆశలు ఉన్నవి ఏవేవో
నిజమే చెపుతూ ఉన్నా
ఆశలు విరిసెను నీవల్లే.. 

 

2 comments:

యెప్పుడీ వినలేదీ పాట..బావుంది..

థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.