శనివారం, మార్చి 07, 2020

రేపటి పౌరులం...

రేపటి పౌరులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రేపటిపౌరులు (1986)
సంగీతం : చక్రవర్తి 
సాహిత్యం : సినారె
గానం : శైలజ 

రేపటి పౌరులం రేపటి పౌరులం
రేపటి పౌరులం
రేపటి పౌరులం రేపటి పౌరులం
రేపటి పౌరులం

అధికారంతో ఐశ్వర్యంతో
అక్రమాలు తెగ సాగించే
పెద్దలకే తగు బుద్దులు చెప్పే
విప్లవ వీరుల వారసులం

రేపటి పౌరులం రేపటి పౌరులం
రేపటి పౌరులం

సత్యాగ్రహాల గాంధీలం
సమత శాంతుల నేహ్రులం
సాహసంలో సుభాసులం
సంకల్పం లో పటేలులం
తెగించి దూకితే భగత్ సింగులం
తిరుగుబాటు లో రామరాజులం
నీతికి నిలిచిన నేతలు
ఎత్తిన నిప్పుల పిడికిళ్ళం

రేపటి పౌరులం రేపటి పౌరులం
రేపటి పౌరులం

న్యాయం చేసే నల్ల కోటే
నందిని పందిగ చేస్తుంటే
ప్రాణం పోసే తెల్ల కోటే
ప్రాణాలను కాటేస్తుంటే
చట్టాలను కాపాడే లాఠీ
పట్టపగలే బరితెగుతుంటే
ప్రజాసేవకై తొడిగిన టోపి
పాపాలను దాచేస్తుంటే
కప్పిన ముసుగులు చించేస్తాం
ఉప్పెనలా ముందడుగేస్తాం

రేపటి పౌరులం రేపటి పౌరులం
రేపటి పౌరులం

చీకటి చీల్చుకు వెళుతున్నాం
రేపటి ఎర్రటి వెలుగుల కోసం
నగరాలను విడిచెళుతున్నాం
నరపశువుల పరివర్తనకోసం
ఆగదు ఆగదు మా నడక
అన్యాయం తల వంచేదాక
ఆగదు ఆగదు మా నడక
అంతిమ గమ్యం చేరే దాక
ఆగదు ఆగదు మా నడక
అంతిమ గమ్యంచేరేదాక
ఆగదూ....ఆగదూ....ఆగదూ...


2 comments:

ఈ మూవీ బావుంటుంది..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.