శనివారం, మార్చి 28, 2020

జూన్ జూలై ఒడిలో పూసే...

కళాశాల చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కళాశాల (2009)
సంగీతం : జాషువా శ్రీధర్    
సాహిత్యం : భువనచంద్ర
గానం : రాహుల్ నంబియార్

జూన్ జూలై ఒడిలో పూసే
పువ్వేరా స్నేహం
రాదారి పక్కన విచ్చే
మొగ్గే కదరా మన స్నేహం
గుండెల్లో మెదిలే
జ్ఞాపకమేరా ఈ స్నేహం
లోకంలో పూసే పూలన్నీ
ఒక రోజులో వసి వాడునురా

జూన్ జూలై ఒడిలో పూసే
పువ్వేరా స్నేహం
రాదారి పక్కన విచ్చే మొగ్గే
కదరా మన స్నేహం
గుండెల్లో మెదిలే
జ్ఞాపకమేరా ఈ స్నేహం
లోకంలో పూసే పూలన్నీ
ఒక రోజులో వసి వాడునురా
ఎన్నడు అరె ఎన్నడూ
విడిపోనిదే మన స్నేహమురా

ఊరేదో పేరేదో చూడమే
కన్నీళ్ళు తుడవడం మరువమే
నీ బాధ చూడలేక మనసు ఆగలేక
కురియు వర్షమే చెలిమిరా
కాలేజీ ఇచ్చే కానుక
కడదాక నిలిచే స్నేహమే
ఇది పాఠాల నిలయమైన
టీచింగే మధురమైన మాటలు
మిగిలేటి బంధమే
ఎన్నెన్నో అల్లరులే చేస్తాం
ఎన్నెన్నో స్వప్నాలే కంటాం
ఎన్నెన్నో గాయాలను చూస్తాం నేస్తమా
ఎన్నెన్నో పాఠాలను చదివి
ఎన్నెన్నో నీతుల్నే నేర్చి
ఎన్నెన్నో గొడవల్నే పడినా
ఎన్నెన్నో నిరసనలే చేసిన
గుండెల్లో స్నేహముండునోయ్

జూన్ జూలై ఒడిలో పూసే
పువ్వేరా స్నేహం
రాదారి పక్కన విచ్చే మొగ్గే
కదరా మన స్నేహం
గుండెల్లో మెదిలే
జ్ఞాపకమేరా ఈ స్నేహం
లోకంలో పూసే పూలన్నీ
ఒక రోజులో వసి వాడునురా
ఎన్నడు అరె ఎన్నడూ
విడిపోనిదే మన స్నేహమురా

విత్తుల్లో దాగిన మొక్కనీ
వాన మొలకెత్తించెనే
ఎదలో మరుగుపడ్డ
మధుర భావనని
స్నేహమే వెలికి తీయులే
ఈనాటి మనమధ్య చెలిమిని
కాలేజీ నీడలు తెలుపులే
ఈ కాలేజీ బెంచ్ లన్నీ
కాంపౌండు గోడలన్నీ
మరల కథలు వినిపించులే
హాలిడేస్ ఇచ్చేశారంటే
ఇళ్ళల్లో మనసుండదు అంటా
మళ్ళీ కలిసే దాకా ఆగమే
ఒంటరిగా క్షణమే యుగముగా
మిస్సయ్యే ఊహలో నిట్టూర్పులు రాగా
అందరమూ ఒకటయ్యే దాకా
నవ్వుల్నీ చిందించే దాకా
గుండెల్లో బెంగ తగ్గదే

జూన్ జూలై ఒడిలో పూసే
పువ్వేరా స్నేహం
రాదారి పక్కన విచ్చే మొగ్గే
కదరా మన స్నేహం
గుండెల్లో మెదిలే
జ్ఞాపకమేరా ఈ స్నేహం
లోకంలో పూసే పూలన్నీ
ఒక రోజులో వసి వాడునురా
ఎన్నడు అరె ఎన్నడూ
విడిపోనిదే మన స్నేహమురా  
 

1 comments:

చాలా బాగా రాసారు.. ధన్యవాదాలు.
అలాగే ఒక సారి నా బ్లాగును కూడా చూసి మీ ప్రేక్షకులతో పంచుకుంటారని ఆశిస్తున్నాను.
https://www.vyayamasamayam.in

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.