మంగళవారం, మార్చి 24, 2020

మమ్మీ.. మమ్మీ..

అమ్ములు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అమ్ములు (2002)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్  
సాహిత్యం : గుండవరపు సుబ్బారావు
గానం : శృతి, మంజుల

మమ్మీ మమ్మీ... డాడీ డాడీ
విష్ యూ హాపీ న్యూ ఇయర్ 2003
మమ్మీ మమ్మీ... డాడీ డాడీ
విష్ యూ హాపీ న్యూ ఇయర్ 2003

లెట్ మి ప్లే లెట్ మి సింగ్
లెట్ మి డాన్స్ మమ్మీ
లెట్ మి క్రై లెట్ మీ లాఫ్
లెట్ మి స్లీప్ డాడీ
లెట్ మి ప్లే లెట్ మి సింగ్
లెట్ మి డాన్స్ మమ్మీ
లెట్ మి క్రై లెట్ మీ లాఫ్
లెట్ మి స్లీప్ డాడీ

మమ్మీ మమ్మీ... డాడీ డాడీ
విష్ యూ హాపీ న్యూ ఇయర్ 2003
మమ్మీ మమ్మీ... డాడీ డాడీ
విష్ యూ హాపీ న్యూ ఇయర్ 2003

ఫైవ్ ఓ క్లాక్ కే లేపేరు మొహాన నీళ్ళే చల్లేరు
ఆ చల్లటి నీళ్ళు మా కన్నీళ్ళతో కలిసిపోతాయి
టిఫెన్ రెడీ అని అంటారూ నోట్లో పెట్టీ కుక్కేరూ
ఆకలి లేదూ అమ్మా అంటే చెంపను ఓటీ ఇచ్చేరూ

రిక్షావాడూ వస్తాడూ బెల్లును ఘల్లున కొడతాడూ
నలుగురు పట్టే రిక్షాలోనా ఇరవై మందిని కుక్కేడూ
టాప్ లేనీ రిక్షాలోనా ట్రాఫిక్కు జాముల్లోనా
బతికాము చాల్లే అంటూ ఆనందంగా బడిలోకి
అడుగులు పెడతామూ

పొల్యూషన్ పీల్చీ మెదడు పాడైపోయింది మమ్మీ
సొల్యూషన్ లేక మాథ్సు ఫెయిలైపోయాను డాడీ
టీచరుకొట్టే దెబ్బలకోసం తయారుగున్నాము

మమ్మీ మమ్మీ... డాడీ డాడీ
విష్ యూ హాపీ న్యూ ఇయర్ 2003

ప్రీకేజీలో వేశారూ ఎల్కేజీలో తోశారూ
బండెడు బుక్సూ వీపున వేసీ యూకేజీకి పంపారు
పుస్తకాలు మోసి మోసీ నడుమే వొంగి పోతుంది
భవిష్యత్తులో గూని వచ్చునని భయమే పుడుతుంది

ఫస్టు రాంకు రాకుంటే పట్టుకోనీ కొడతారు
అరవై మందికి ఫస్టు ర్యాంకును టీచర్ ఎట్లా వేస్తుంది
పప్పుల్ని పిండి చేసే రుబ్బురోలు లాగా మేము
పుస్తకాలు రుబ్బి రుబ్బి ఐదేళ్ళకే బామ్మల్లా
కళ్ళజోడు పెడతామూ

ప్రిన్సిపల్ కి పాటలు అంటే పిచ్చి అలర్జీ డాడీ
కాన్వెంటులో ఆటలు ఆడే గ్రౌండే లేదు మమ్మీ
కాళ్ళకి తాళ్ళు కట్టి పడేసిన నెమళ్ళమయ్యాము

మమ్మీ మమ్మీ... డాడీ డాడీ
విష్ యూ హాపీ న్యూ ఇయర్ 2003
లెట్ మి ప్లే లెట్ మి సింగ్
లెట్ మి డాన్స్ మమ్మీ
లెట్ మి క్రై లెట్ మీ లాఫ్
లెట్ మి స్లీప్ డాడీ 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.