డబ్బుకు లోకం దాసోహం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : డబ్బుకు లోకం దాసోహం (1973)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల, రమాదేవి
గాలి ఒకని సొమ్ముకాదు
వెలుగు ఒకని సొంతం కాదు
ఆఆ...ఆఆ...ఆఆఅ...
చదువూ సంపద అందరిదీ
పాడీ పంటా అందరిదీ
పరువుగ బ్రతికే జన్మహక్కు
మనిషి అన్న ప్రతివానిదీ
చదువూ సంపద అందరిదీ
పాడీ పంటా అందరిదీ
పరువుగ బ్రతికే జన్మహక్కు
మనిషి అన్న ప్రతివానిదీ
విధిని నమ్ముకొను రివాజులు
ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు
ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు
వేలి ముద్రల రోజులు
ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు
ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు
ఎవరి జీవితం వారు దిద్దుకొను
తెలివి పెంచుకోవాలి
ఎవరి జీవితం వారు దిద్దుకొను
తెలివి పెంచుకోవాలి
అందరు బాగా చదువుకొని
మా అయ్యకు బుద్ది చెప్పాలి
బాబయ్య భరతం పట్టాలి
చదువూ సంపద అందరివీ
పాడీ పంటా అందరిదీ
పరువుగ బ్రతికే జన్మహక్కు
మనిషి అన్న ప్రతివానిదీ
హరిజనులూ గిరిజనులూ
అందరూ నేడు పురజనులే
అందరూ నేడు పురజనులే
వున్నవారికే చదువులనే
ఆ నమ్మకాలు ఇక చెల్లవులే
ఆ నమ్మకాలు ఇక చెల్లవులే
బడియే సరిక్రొత్త తరానికి
గుడిలాంటిదని చాటాలి
బడియే సరిక్రొత్త తరానికి
గుడిలాంటిదని చాటాలి
బడిని గుడిని మింగేవాళ్ళను
బజారులో నిలదీయాలి
బడిత పూజే చేయాలి
చదువూ సంపద అందరివీ
పాడీ పంటా అందరిదీ
పరువుగ బ్రతికే జన్మహక్కు
మనిషి అన్న ప్రతివానిదీ
2 comments:
మంచి పాట..యాప్ట్ పిక్..
థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.