గురువారం, మార్చి 12, 2020

పాడుకో పాడుకో...

ప్రైవేటు మాస్టారు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రైవేటు మాస్టారు (1967)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు  

పాడుకో పాడుకో
పాడుతూ చదువుకో
పాడుకో పాడుకో
పాడుతూ చదువుకో
పాడుకో

ఆదిలో మన విద్య లయబద్ధమే
వేదాలు నాలుగు సంగీతమే
ఆదిలో మన విద్య లయబద్ధమే
వేదాలు నాలుగు సంగీతమే
పాఠాలు పాటగా వల్లించితే
పాఠాలు పాటగా వల్లించితే
వినోదం వికాసం విరాజిల్లులే

పాడుకో పాడుకో
పాడుతూ చదువుకో
పాడుకో

రాళ్ళైనా కరిగించు గాంధర్వమూ
రమణీయము అదె కమనీయమూ
రాళ్ళైనా కరిగించు గాంధర్వమూ
రమణీయము అదె కమనీయమూ
సంగీతమేదైనా సాధించునూ
సంగీతమేదైనా సాధించునూ
స్వరాలా ప్రభావం అమోఘం సుమా

పాడుకో పాడుకో
పాడుతూ చదువుకో
పాడుకో పాడుకో
పాడుతూ చదువుకో
పాడుకో 

 

2 comments:

పిక్ భలే ఉంది..

నాక్కూడా బాగా నచ్చిందండీ :-) థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.