శనివారం, మార్చి 21, 2020

భలే తాత మన బాపూజీ...

దొంగరాముడు చిత్రంలోని ఒక చక్కని మధుర గీతాన్ని తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దొంగరాముడు (1955)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : సుశీల

భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
బోసినవ్వుల బాపూజీ
చిన్నీ పిలక బాపూజీ

భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ

కుల మత భేదం వలదన్నాడు
కలిసి బతికితే బలమన్నాడు
మానవులంతా ఒకటన్నాడు
మనలో జీవం పోశాడు

భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
 
నడుం బిగించి లేచాడు
అడుగూ ముందుకు వేశాడు
కదం తొక్కుతూ పదం పాడుతూ
దేశం దేశం కదిలింది
గజగజలాడెను సామ్రాజ్యం
మనకు లభించెను స్వారాజ్యం
మనకు లభించెను స్వారాజ్యం

భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
 
సత్యాహింసలె శాంతి మార్గమని
జగతికి జ్యోతిని చూపించాడు
మానవ ధర్మం బోధించాడు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మానవ ధర్మం బోధించాడు
మహాత్ముడై ఇల వెలిశాడు

భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.