చిరంజీవి రాంబాబు సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : చిరంజీవి రాంబాబు (1978)
సంగీతం : జె.వి.రాఘవులు
సాహిత్యం :
గానం : సుశీల, కోరస్
చదవాలి ఎదగాలి చిన్నపిల్లలూ
అది చూసి మురవాలి తల్లిదండ్రులు
చదవాలి ఎదగాలి చిన్నపిల్లలూ
అది చూసి మురవాలి తల్లిదండ్రులు
అనుభవాల ఓనమాలు దిద్దుకొంటూ
అనుభవాల ఓనమాలు దిద్దుకొంటూ
మంచీ చెడు గుణింతాలు తెలుసుకుంటూ
చదవాలి ఎదగాలి చిన్నపిల్లలూ
అది చూసి మురవాలి తల్లిదండ్రులు
చదువెపుడూ దీపంలా వెలుగుతుంది
మనిషి మనసులోని చీకటిని మాపుతుంది
చదువెపుడూ దీపంలా వెలుగుతుంది
మనిషి మనసులోని చీకటిని మాపుతుంది
బ్రతుకంటే ఏమిటో నేర్పుతుంది
బ్రతుకంటే ఏమిటో నేర్పుతుంది
నిన్ను పదుగురిలో పెద్దగా నిలుపుతుంది
చదవాలి ఎదగాలి చిన్నపిల్లలూ
అది చూసి మురవాలి తల్లిదండ్రులు
కులమతాలు నీ మనసుకు సోక కూడదు
కలనైనా ఎవరి చెరుపు కోరకూడదు
కులమతాలు నీ మనసుకు సోక కూడదు
కలనైనా ఎవరి చెరుపు కోరకూడదు
ఒకరి తప్పులెంచుకుంటు గడప కూడదు
ఒకరి తప్పులెంచుకుంటు గడప కూడదు
తప్పు జరుగ కూడదూ
చదవాలి ఎదగాలి చిన్నపిల్లలూ
అది చూసి మురవాలి తల్లిదండ్రులు
అనుభవాల ఓనమాలు దిద్దుకొంటూ
అనుభవాల ఓనమాలు దిద్దుకొంటూ
మంచీ చెడు గుణింతాలు తెలుసుకుంటూ
చదవాలి ఎదగాలి చిన్నపిల్లలూ
అది చూసి మురవాలి తల్లిదండ్రులు
అది చూసి మురవాలి తల్లిదండ్రులు
2 comments:
యెప్పుడూ వినలేదీ పాట..బావుంది..
థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.