అమెరికా అబ్బాయి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అమెరికా అబ్బాయి (1986)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : సుశీల
ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ...
రాయప్రోలన్నాడు ఆనాడూ..
అది మరిచిపోవద్దు ఏనాడూ..
పుట్టింది నీ మట్టిలో సీత
రూపు కట్టింది దివ్య భగవద్గీత
వేదాల వెలసినా ధరణిరా
వేదాల వెలసినా ధరణిరా
ఓంకార నాదాలు పలికినా అవనిరా
ఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవని నాడు
వికసించె మననేల విజ్ఞాన కిరణాలు
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా..
ఏ పీఠమెక్కినా.. ఎవ్వరెదురైనా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ..
వెన్నెలదీ ఏ మతమురా...?
కోకిలదీ ఏ కులమురా...?
గాలికి ఏ భాష ఉందిరా...?
నీటికి ఏ ప్రాంతముందిరా...?
గాలికీ నీటికీ లేవు భేధాలూ..
మనుషుల్లో ఎందుకీ తగాదాలు
కులమత విభేదాలూ
ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...
ఏ పీఠమెక్కినా... ఎవ్వరెదురైనా...
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ...
గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ..
గాంధీ చూపిన మార్గం విడవద్దూ....
గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ
గాంధీ చూపిన మార్గం విడవద్దూ....
ద్వేషాల చీకట్లూ తొలగించూ..
స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించూ
ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్షా
అందుకే నిరంతరం సాగాలి దీక్షా...
అందుకే నిరంతరం సాగాలి దీక్షా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.