మంగళవారం, మార్చి 17, 2020

గగనం మనకు బాట...

అంజలి సినిమాలోని మరో చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అంజలి (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : డి.కౌసల్య,ఆర్.సులోచన, బి.పద్మ, ఆర్.సుచిత్ర, లలిత, ఆర్, మహలక్ష్మి, ఎస్.ఎన్.హేమ మాలిని, ఆర్.కల్పన, ఆర్.ప్రసన్న, జమ, శుభశ్రీ, షర్మిల

హే..యా.. పపప పాపా.. పపపాపా పాపాప..
పపప పా పపప పా పా పా
హేయా.. హేయా.. పపపప
గగనం మనకు బాట.. మేఘం మనకు జంట...
గగనం మనకు బాట.. మేఘం మనకు జంట...
గాలుల్లో తేలుదాం.. సరదాగా సాగుదాం
గగనమేలే లేదెదురిక
గగనం మనకు బాట.. మేఘం మనకు జంట...

ఊరుచుట్టు బాలలకు ఈ మండుటెండ వెన్నెలమ్మ.
పిల్లవాళ్ళ కన్నులకు.. ఈ పగటివేళ రాతిరమ్మా..
ఈనాడు మనమంత జాజిమల్లె పూలే..
ఈ పూట వలదంట పాఠమన్న గోలే
ఈనాడు మనమంత జాజిమల్లె పూలే..
ఈ పూట వలదంట పాఠమన్న గోలే 
మనము పొంగే ఏరులే.. మనకు లేవే హద్దులే..

గగనం మనకు బాట.. మేఘం మనకు జంట...
గాలుల్లో తేలుదాం.. సరదాగా సాగుదాం
రగడకేమి లేదెదురిక
గగనం మనకు బాట.. మేఘం మనకు జంట...

పట్టుకోటలోన ఉంది పాటశాలలోన కష్టపడి
పట్టుకోట వీడి వీడి చిన్ని గువ్వలల్ల నింగి తేలి
ఆకాశా వీధిలోన పాటలన్ని పాడే ..
అందాల చిందులాడి తాళమేసి ఆడే
ఆకాశా వీధిలోన పాటలన్ని పాడే ..
అందాల చిందులాడి తాళమేసి ఆడే
మనము పొంగే ఏరులే.. మనకు లేవే హద్దులే..

గగనం మనకు బాట.. మేఘం మనకు జంట...
గాలుల్లో తేలుదాం.. సరదాగా సాగుదాం
రగడకేమి లేదెదురిక
గగనం మనకు బాట.. మేఘం మనకు జంట...
పాపా పపప పాపా.. పాపా.. పపప పాపా... 


2 comments:

చిన్నప్పుడు ఇంత అద్భుతమైన నటన ప్రదర్శించిన షామిలి పెద్దయ్యాక ఆకట్టుకో లేదనుకుంటే..తమాషాగా ఉంటుంది.

హ్మ్.. నాకూ అపుడపుడు అదే ఆశ్చర్యమనిపిస్తుందండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.