రాక్షసుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : రాక్షసుడు (1986)
సంగీతం : ఇళయరాజా
లలిత గీతపు బాణీ : అవసరాల(వింజమూరి) అనసూయా దేవి)
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : జానకి
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయనేత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయనేత్రి
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ సశ్యామల
సుశ్యామచలాచ్చేలాంచల
జయ జయ సశ్యామల
సుశ్యామచలాచ్చేలాంచల
జయ వసంత కుసుమ లతా
చలిత లలిత చూర్ణకుంతల
ఆఆఆఆఆఆ..ఆఆఆఆఆ..
జయ మదీయ హృదయాశయ
లాక్షారుణ పదయుగళా
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
జయ దిశాంత గత శకుంత
దివ్య గాన పరితోషణ
జయ దిశాంత గత శకుంత
దివ్య గాన పరితోషణ
జయ గాయక వైతాళిక
గళ విశాల పత విహరణ
ఆఆఆఆఆ..ఆఆఆఆఆ..
జయ మదీయ మధురగేయ
చుంబిత సుందర చరణా
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయనేత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయనేత్రి
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
5 comments:
భరతమాతకు అద్భుతమైన స్తుతి గీతం. భరత మాతకు వందనం.
అవునండీ.. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ అజ్ఞాత గారు..
కుంభ మేళా నించీ..పుష్కరాలూ,మేడారం జాతర వరకూ యెన్ని లక్షల మంది పాల్గొంటున్నా యే వైరస్సూ ఇండియా లో పుట్ట లేదంటే నిజంగా మనది దివ్య ధాత్రే కదా..
అంతే కదండీ మరి.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..
మీరు మనసులకు ఇస్తున్న ఆనందాలకు ప్రతిగా బహుమతి గా ఎవరైనా ఏమివ్వగలరండీ నమస్కృతులు తప్ప..ఇవే..నా నమశ్శతాలు..సన్నుతులు..ఆశీస్సులు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.