బుధవారం, మార్చి 11, 2020

పిల్లలము బడి పిల్లలము...

బడిపంతులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడీయో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బడి పంతులు (1972)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : సుశీల, కోరస్  

పిల్లలము బడి పిల్లలము
పిల్లలము బడి పిల్లలము
నడుములు కట్టి కలిశాము
పిడికిలి బిగించి కదిలాము
పిల్లలము బడి పిల్లలము

పిల్లలము పిల్లలము
బడి పిల్లలము బడి పిల్లలము
నడుములు కట్టి కలిశాము
పిడికిలి బిగించి కదిలాము

 
పలక బలపం పట్టిన చేతులు
పలుగు పార ఎత్తినవి
పలుగు పార ఎత్తినవి
పలక బలపం పట్టిన చేతులు
పలుగు పార ఎత్తినవి
ఓనమాలను దిద్దిన వేళ్ళు
ఒకటై మట్టిని కలిపినవి
ఒకటై మట్టిని కలిపినవి

పిల్లలము  పిల్లలము
బడి పిల్లలము బడి పిల్లలము

ప్రతి అణువు మా భక్తికి గుర్తు
ప్రతి రాయి మా శక్తికి గుర్తు
ప్రతి అణువు మా భక్తికి గుర్తు
ప్రతి రాయి మా శక్తికి గుర్తు

చేతులు కలిపి చెమటతో తడిపి
చేతులు కలిపి చెమటతో తడిపి
కోవెల కడదాం గురుదేవునికి
కోవెల కడదాం మా గురుదేవునికి
పిల్లలము పిల్లలము
బడి పిల్లలము బడి పిల్లలము
 
తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు
తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు
తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు
తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు
తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు
తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు

వెలుగును తెచ్చే ఈ కిటికీలు
పంతులు గారి చల్లని కళ్ళు 
పంతులు గారి చల్లని కళ్ళు

పిల్లలము.. పిల్లలము..
బడి పిల్లలము.. బడి పిల్లలము
నడుములు కట్టి కలిశాము
పిడికిలి బిగించి కదిలాము
పిల్లలము బడి పిల్లలము..
ల.లాలా..లా..లా.లా 


2 comments:

ఆ రోజుల్లో పిల్లల ఓరియెంటెడ్ గానో, దేశభక్తి పైనో ఒక్క పాటైనా ఉండేదనుకుంటా.

కరెక్టండీ..థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.