రేపటి పౌరులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : రేపటి పౌరులు (1986)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వంగపండు
గానం : శ్రీనివాస్, శైలజ
అయ్యా నే సదివి బాగు పడతా
ఓరయ్యా నే సదివి బాగు పడతా
పుస్తకాలు సదువుకొని
మన బతుకులు మారుత్తా
అయ్యా నే సదివి బాగు పడతా
ఓరయ్యా నే సదివి బాగు పడతా
అమ్మమ్మ నీయమ్మ కొంప నాది తీత్తవేటి
సదువు భూతం పడితే నువ్వు సంకనాకి పోతావు
బి.ఏ ఎం.ఏ చదివినోళ్ళె బికర్లయ్యి తిరుగుతుండ్రు
సదువు గోల నీకొద్దురో కొడుకా
సావు బతుకు మనకోద్దురో ఒరేయ్ ఒరేయ్
సదువు గోల నీకొద్దురో కొడుకా
సావు బతుకు మనకోద్దురా
ఆ డాకటేరు కొడుకులాగా డాబు డూబుగుంటాను
ప్లీడరు గారి కొడుకు లాగ నెక్కు టై కడతాను
ఎస్ ఐ గారి కొడుకు లాగ సైకిలెక్కి బడికెళ్త
అయ్యా నే సదివి బాగు పడతా
ఓరయ్యా నే సదివి బాగు పడతా
మతి బోయిన్దేటి నీకు మారాజుల బిడ్డలాళ్ళు
ఆళ్ళతోటి పోలికేటి అడుక్కునే నా కొడుకా
పనీ పాట లేనోల్లకు సదువే ఒక పెద్ద పని
సదువు గిదువు అన్నవంటే సెంప పగల గొడతాను
సదువు గోల మనకొద్దురా కొడుకా
చావు బతుకు మనకోద్దురా ఒరేయ్
దండించకు ఓరయ్య దండం బెడతా నీకు
ఈదుల్లో బడులున్నయ్ ఇస్కూలు బడులున్నయ్
పంతుల్లకు కాళ్ళు మొక్కి సదువు బిచ్చ పెట్టమంట
అయ్యా నే సదివి బాగు పడతా
ఓరయ్యా నే సదివి బాగు పడతా
ఈదుల్లో బడుల్లోన పందులు తొంగుటున్నాయి
అందులోన పంతుళ్ళు పేక తురాణాలాడి
ప్రైవేటులు చదివితేనే పాసు చేస్తమంటండ్రు
సదువుకునే రోజులెల్లి సదువులు కొనే రోజులోచ్చే
సదువు గోల మనకొద్దురా కొడుకా
సావు బతుకు మనకోద్దురా ఒరేయ్
డబ్బు గోల నీకెందుకు ఆ బాదలు నేబడత
గవర్నమెంట్ సదువంట గరీబొల్ల సదువంట
అనాదోడి బిడ్డణ్నని హాట్టల్లో జేరత
పుత్తకాలు బట్టలు ఉత్తినే ఇత్తారంట
అయ్యా నే సదివి బాగు పడతా
ఓరయ్యా నే సదివి బాగు పడతా
నమ్మకురా ఆ మాట నంజి కొడక సెడిపోతవ్
అనాదోల్ల పుత్తకాలు అచ్చవలేదంటారు
షాపు లోన పుత్తకాలు సాటు మాటుగమ్ముతుండ్రు
పసి పిల్లల హాస్టల్లో పాసికూడు పెడతండ్రు
కొటాల నాయకులు వాటాలు పంచుకునీ
హాట్టళ్ళ సొమ్ము నంత ఓటర్లకు పంపుతుర్రు
సదువు గోల నీకొద్దురో కొడుకా
సావు బతుకు మనకోద్దురో ఒరేయ్
కట్టమైన నట్టమైన కాన్వెంటుకు పంపించు
ఇంగిలీషు సదివి నేను ఇంజినీరునయ్యొత్త
ఈ రిచ్చబతుకు నీకెందుకు కారు నీకు కొనిదెత్త
అయ్యా నే సదివి బాగు పడతా
ఓరయ్యా నే సదివి బాగు పడతా
నీ కాన్వెంటు సదువుకి కరుగుతాయి నా కండలు
ఇంజినీరు సదువుకి ఇంకుతాది నా నెత్తురు
నువ్వు కారు గొనేలోపు నేను కాటికెళ్ళి పోతాను
సదువు గోల నీకొద్దురో కొడుకా
సావు బతుకు మనకోద్దురా అయ్యా
ఫై సదువులు చదువుకోని పట్టానే పట్టుకొని
మధ్యవర్తి మంతిరికి లంచాలు కట్టుకొని
ఆ దోరకని పనులకు ఆపీసులు తిరిగి తిరిగి
ఇసిగిపోయి చివరకి ఈ కప్పులు కడిగే కంటే
ముందు గానే ఈ పనులు ముచ్చటగా చేసుకోర
సదువు గోల నీకొద్దురో కొడుకా
సావు బతుకు మనకోద్దురో ఒరేయ్ ఒరేయ్
సదువు గోల నీకొద్దురో కొడుకా
సావు బతుకు మనకోద్దురా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.