సోమవారం, సెప్టెంబర్ 23, 2019

ఇది తొలి రాత్రి...

మజ్ను చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మజ్ఞు (1989)
సంగీతం : లక్ష్మీకాంత్-ప్యారేలాల్
సాహిత్యం : దాసరి 
గానం : బాలు

ఇది తొలి రాత్రి కదలని రాత్రి
ఇది తొలి రాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు
చెప్పుకున్న కథల రాత్రీ
ప్రేయసీ రావే ఊర్వశి రావే
ప్రేయసీ రావే ఊర్వశి రావే

ఇది తొలి రాత్రి కదలని రాత్రి
ఇది తొలి రాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు
చెప్పుకున్న కథల రాత్రీ
ప్రేయసీ రావే ఊర్వశి రావే
ప్రేయసీ రావే ఊర్వశి రావే..

వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ
మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ
మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ
దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ
నీ రాక కొరకు తలుపు
నీ పిలుపు కొరకు పానుపు
పిలిచి...పిలిచి.. వేచి..వేచి
ఎదురుచూస్తున్నవీ..ఈ...ఈ...ఈ...

ప్రేయసీ రావే ఊర్వశి రావే
ప్రేయసీ రావే ఊర్వశి రావే


వెన్నలంతా అడవి పాలు కానున్నదీ
మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ...ఆ..ఆ..ఆ..
ఆ..ఆ వెన్నలంతా అడవి పాలు కానున్నదీ
మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
అనురాగం గాలీలో దీపమైనదీ
మమకారం మనసునే కాల్చుతున్నదీ

నీ చివరి పిలుపు కొరకు
ఈ చావు రాని బ్రతుకూ
చూసి చూసి వేచి వేచి
వేగిపోతున్నదీ..ఆ..ఆ..ఆ

ప్రేయసీ రావే ఊర్వశి రావే
ప్రేయసీ రావే ఊర్వశి రావే 


2 comments:

కళ్లు మూసుకుని వింటే బానే ఉంటుందీ పాట..

హహహహ థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.