శనివారం, సెప్టెంబర్ 14, 2019

కల చెదిరింది...

సూపర్ స్టార్ కృష్ణ నటించిన దేవదాసు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దేవదాసు (కృష్ణ) (1974)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు

కల చెదిరిందీ... కథ మారిందీ
కన్నీరే ఇక మిగిలిందీ..
కన్నీరే ఇక మిగిలిందీ

కల చెదిరిందీ.. కథ మారిందీ
కన్నీరే ఇక మిగిలిందీ...
కన్నీరే ఇక మిగిలిందీ

ఒక కంట గంగ.. ఒక కంట యమునా
ఒక్కసారే కలసి ఉప్పొంగెనూ..
ఒక్కసారే కలసి ఉప్పొంగెనూ

కన్నీటి వరదలో నువు మునిగినా
చెలి కన్నుల చెమరింపు రాకూడదూ
చెలి కన్నుల చెమరింపు రాకూడదూ

కల చెదిరిందీ... కథ మారిందీ..
కన్నీరే ఇక మిగిలిందీ
కన్నీరే ఇక మిగిలిందీ

మనసొక చోట మనువొక చోట
మమతలు పూచిన పూదోట
మమతలు పూచిన పూదోట

కోరిన చిన్నది కుంకుమ రేఖల
కుశలాన ఉండాలి ఆ చోట
కుశలాన ఉండాలి ఆ చోట

కల చెదిరిందీ.. కథ మారిందీ...
కన్నీరే ఇక మిగిలిందీ...
కన్నీరే ఇక మిగిలిందీ


2 comments:

ఈ మూవీ లో పాటలన్నీ చాలా బావుంటాయి..మేఘాల మీద సాగాలి, పొరుగింటి దొరగారికి, జీవితం యేమిటీ, ఇది నిశీధ సమయం ఇలా..

అవునండీ రమేష్ నాయుడు గారి సంగీతం కదా ఎంతైనా.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.