బుధవారం, సెప్టెంబర్ 11, 2019

నీ సుఖమే నే కోరుకున్నా...

మురళీకృష్ణ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మురళీకృష్ణ (1964)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : ఆత్రేయ
గానం : ఘంటసాల

ఎక్కడ వున్నా ఏమైనా
మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా

అనుకున్నామని జరగవు అన్నీ
అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికనీ
అనుకోవడమే మనిషి పనీ

నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా


పసిపాపవలె ఒడి జేర్చినాను
కనుపాప వలె కాపాడినాను
గుండెను గుడిగా చేసాను
నువ్వుండలేనని వెళ్ళావు

నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా


వలచుట తెలిసిన నా మనసునకు
మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే
మన్నించుటయే రుజువు కదా!

నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా


నీ కలలే కమ్మగ పండనీ
నా తలపే నీలో వాడనీ
కలకాలం చల్లగ వుండాలని
దీవిస్తున్నా నా దేవిని
దీవిస్తున్నా నా దేవిని

ఎక్కడ వున్నా ఏమైనా
ఎవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా 


2 comments:

నిన్నటి పాట కామెంటే ఈ పాటకీ వేణూజీ..డిటో..డిటో..

హహహ ఐతే నాదీ సేమ్ రెస్పాన్స్ శాంతి గారు :-) ఈ పాటలన్నీ అలా తెలుగు వాళ్ళ మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన పాటలు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.