మంగళవారం, సెప్టెంబర్ 10, 2019

అంతా భ్రాంతియేనా..

దేవదాస్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దేవదాసు (1953)
సంగీతం : సి.ఆర్. సుబ్బరామన్
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య
గానం : కె. రాణి

అంతా.. భ్రాంతియేనా.. జీవితానా.. వెలుగింతేనా
ఆశా.. నిరాశేనా.. మిగిలేది చింతేనా..ఆ ఆ...

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా


చిలిపితనాల చెలిమే మరచితివో.. ఓ ఓ ...
చిలిపితనాల చెలిమే మరచితివో.. ఓ ఓ ...
తలిదండ్రుల మాటే దాటా వెరచితివో.. ఓ ఓ ...
తలిదండ్రుల మాటే దాటా వెరచితివో.. ఓ ఓ ...
పేదరికమ్ము ప్రేమపధమ్ము మూసివేసినదా..
నా ఆశే దోచినదా ...

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా


మనసునలేని వారి సేవలతో.. ఓ ఓ ...
మనసునలేని వారి సేవలతో.. ఓ ఓ ...
మనసీయగలేని నీపై మమతలతో.. ఓ ఓ ...
మనసీయగలేని నీపై మమతలతో.. ఓ ఓ ...
వంతలపాలై చింతింతే నా వంతా దేవదా..
నా వంతా దేవదా.. ఆ ఆ ..

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా


2 comments:

విషాద భరితమైన పాటైనా అందరి మనసుల్లో యెంతగా నిలిచిపోయిందంటే ఈ పాట..ఇప్పటికీ అనుకున్నది జరగక పోతే జోవియల్గానూ, నిజంగానూ కూడా ఈ మాటే యూజ్ చేస్తున్నాము కదా..

అవును శాంతి గారు.. చాలా కరెక్ట్ గా చెప్పారు.. అలా నిలిచిపోయిన పాటలు ఇవి.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.