మజిలీ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మజిలి (2019)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : శివ నిర్వాణ
గానం : కాల భైరవ, నిఖితా గాంధీ
ఏడెత్తు మల్లెలే
కొప్పులోన చేరే
దారే లేదే
నీ తోడు కోయిలే
పొద్దుగూకేవేళ
కూయలేదే
రాయెత్తు అల తెరదాటి
చేరరావే చెలియా
ఈ పొద్దు పీడకల దాటి
నిదరోవే సఖియా
నీ కంటిరెప్ప కలనే
కన్నీటిలోన కథనే
నీ గుండెలోన సడినే
నీ ఊపిరైనా ఊసుని
నా ఊపిరాగినా
ఉసురుపోయినా
వదిలిపోననీ
ఏడెత్తు మల్లెలే
కొప్పులోన చేరే
దారే లేదే
నీ తోడు కోయిలే
పొద్దుగూకేవేళ
కూయలేదే
రాయెత్తు అల తెరదాటి
చేరరావే చెలియా
ఈ పొద్దు పీడకల దాటి
నిదరోవే సఖియా
నీ కంటిరెప్ప కలనే
కన్నీటిలోన కథనే
నీ గుండెలోన సడినే
నీ ఊపిరైనా ఊసుని
నా ఊపిరాగినా
ఉసురుపోయినా
వదిలిపోననీ
2 comments:
బ్యూటిఫుల్ మూవీ..పిక్ చాలా బావుంది..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.