శుక్రవారం, సెప్టెంబర్ 27, 2019

ఏమై పోయావే...

పడి పడి లేచే మనసు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పడి పడి లేచె మనసు (2018)
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం : కృష్ణ కాంత్
గానం : సిధ్ శ్రీరామ్

ఏమై పోయావే నీ వెంటె నేనుంటే
ఏమై పోతానే నువ్వంటు లేకుంటే

నీతో ప్రతి పేజీ నింపేసానే
తెరవక ముందే పుస్తకమే విసిరేసావే
నాలో ప్రవహించే ఊపిరివే
ఆవిరి చేసీ ఆయువునే తీసేసావె
నిను విడిపోనంది నా ప్రాణమే
నా ఊపిరినే నిలిపేదీ నీ ధ్యానమే
సగమే నే మిగిలున్నా
శాసనమిది చెబుతున్నా
పోనే.. లేనే.. నిన్నొదిలే

ఏమై పోయావే నీ వెంటె నేనుంటే
ఏమై పోతానే నువ్వంటు లేకుంటే

ఎటు చూడు నువ్వే ఎటు వెళ్ళనే
నేలేని చోటే నీ హృదయమే
నువు లేని కల కూడ రానే రాదే
కలలాగ నువు మారకే
మరణాన్ని ఆపేటి వరమే నీవే
విరహాల విషమీయకే

ఏమై పోయావే నీ వెంటె నేనుంటే
ఏమై పోతానే నువ్వంటు లేకుంటే 


2 comments:

ఈ మూవీ అసలేమీ అర్ధం కాకపోయినా..ఈ పాట మాత్రం అద్భుతహ..

హహహహ అందుకే సినిమా కూడా పెద్దగా ఆడినట్లు లేదు శాంతి గారూ :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.