సోమవారం, సెప్టెంబర్ 09, 2019

నీకోసమె నే జీవించునది...

మాయాబజార్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మాయాబజార్ (1957)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల సీనియర్
గానం : ఘంటసాల, P.లీల

నీకోసమె..నే జీవించునది
ఈ విరహములో..ఈ నిరాశలో
నీకోసమె..నే జీవించునది

వెన్నెల కూడా..చీకటియైనా
మనసున వెలుగే..లేక పోయినా
నీకోసమె..నే జీవించునది

విరహము కూడా..సుఖమే కాదా
నిరతము చింతన..మధురము కాదా
విరహము కూడా..సుఖమే కాదా
నిరతము చింతన..మధురము కాదా
వియోగ వేళల విరిసే ప్రేమల
విలువను కనలేవా

నీ రూపమె నే ధ్యానించునది
నా హృదయములో..నా మనస్సులో
నీరూపమె..నే ధ్యానించునది

హృదయము నీతో వెడలిపోయినా..
మదిలో ఆశలు మాసిపోయినా..ఆఆ
మన ప్రేమలనే మరి మరి తలచి..
ప్రాణము నిలుపుకొనీ..ఈఈఈఇ
నీకోసమె..నే జీవించునది

మెలకువనైనా కలలోనైనా
కొలుతును నిన్నే ప్రణయదేవిగా
లోకములన్ని ఏకమె అయినా
ఇక నా దానవెగా..ఆ ఆ ఆ

నీ రూపమెనే ధ్యానించునది
ఈ విరహాములో..ఈ నిరాశలో
నీకోసమె..నే జీవించునది 

 

2 comments:

ఈ కైండ్ ఆఫ్ చాలా పాటలకి టేకింగ్ లో కానీ..ఫీల్ లో కానీ..ఈ పాట ఇన్ స్పిరేషన్ అనిపిస్తుంది..

కరెక్టేనండీ.. అద్భుతమైన పాట.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.