సోమవారం, సెప్టెంబర్ 30, 2019

అమ్మా భవాని...

శివరామరాజు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శివరామరాజు (2002)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : చిర్రావూరి విజయ కుమార్
గానం : బాలు

ఓం శక్తి మహా శక్తి
ఓం శక్తి మహా శక్తి
అమ్మా భవాని లోకాలనేలే
ఓంకార రూపవమ్మా
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా

అమ్మా భవాని లోకాలనేలే
ఓంకార రూపవమ్మా
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా

ఓ.....సృష్టికే దీపమా
శక్తికే మూలమా
సింహ రథమే నీదమ్మా
అమ్మ దుర్గమ్మా
భక్తులను దీవించుమా

అమ్మా భవాని లోకాలనేలే
ఓంకార రూపవమ్మా
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా


అమ్మా పసుపు కుంకుమ
చందనము పాలభిషేకం
ఎర్రని గాజులతో పూవులతో
నిను కొలిచాము

అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు
అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు
అమ్మ పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు
అమ్మ ముక్కోటి మెరుపుల మోము చూడు
అమ్మమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ
నీ అడుగులే కాపలాలు

అమ్మ నిప్పుల్ని తొక్కిన నడక చూడు
అమ్మ దిక్కుల్ని దాటిన కీర్తి చూడు
వెయ్యి సూరీళ్ళై మెరిసిన శక్తిని చూడు
మనుషుల్లో దేవుడీ భక్తుని చూడు
నీ పాద సేవయే మాకు పుణ్యం
అమ్మ నీ చూపు సోకితే జన్మ ధన్యం

అమ్మా భవాని లోకాలనేలే
ఓంకార రూపమమ్మా
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా


ధిన్నకు ధిన్నకుతా
ధిన్నకు ధిన్నకుతా
గల గల గల గల
గల గల గల గల
ధిన్నకు ధిన్నకుతా

గజ్జెలనే కట్టి ఢమరుకమె పట్టి
నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట
ఊరే ఊగేల ఇయ్యాలి హారతి
ఊరే ఊగేల ఇయ్యాలి హారతి
కాయలు కొట్టి ఫలములు పెట్టి
పాదాలు తాకితే
అడిగిన వరములు ఇచ్చును తల్లీ

చీరలు తెచ్చాం రైకలు తెచ్చాం
చల్లంగా అందుకో
జై జై శక్తి శివ శివ శక్తి
జై జై శక్తి శివ శివ శక్తి

కంచిలొ కామాక్షమ్మ
మధురలొ మీనాక్షమ్మ నువ్వే అమ్మ
కాశీలో అన్నపూర్ణవే మాతా
శ్రీశైలంలో భ్రమరాంబ
బెజవాడ కనక దుర్గవు నువ్వే అమ్మా
కలకత్తా కాళి మాతవే మాతా

నరకున్ని హతమార్చి శ్రీ కృష్ణున్ని కాచి
సత్యభామై శక్తే చూపినావే
నరలోక భారాన్ని భూదేవై మోసి
సాటిలేని సహనం చాటినావే

భద్రకాళీ నిన్ను శాంత పరిచేందుకు
రుద్రనేత్రుండు శివుడైన సరి తూగునా
బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు
నీ పదధూళిని తాకగా వచ్చేనట
బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు
నీ పదధూళిని తాకగా వచ్చేనట
నీ పదధూళిని తాకగా వచ్చేనట

జై బోలో దుర్గా మాత కీ జై .

జై మాత . 


2 comments:

బాలా త్రిపుర..దేవీ నమోస్తుతే..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.