బుధవారం, సెప్టెంబర్ 25, 2019

అడిగా అడిగా...

నిన్ను కోరి చిత్రంలోని ఒక హాంటింగ్ మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నిన్నుకోరి (2017)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : శ్రీజో
గానం : సిద్ శ్రీరామ్

అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలె క్షణమా చెలి ఏదని
నన్నే మరిచా తన పేరునె తలిచా
మదినే అడిగా తన ఊసేదని

నువ్వే లేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోను వెతికితే మనకథే
నీలోనె ఉన్నా నిను కోరి ఉన్నా
నిజమై నడిచా జతగా

గుండెలోతుల్లొ ఉంది నువ్వేగా
నా సగమే నా జగమే నువ్వేగా
నీ స్నేహమే నను నడిపే స్వరం
నిను చేరగ ఆగిపొనీ పయనం
అలుపే లేని గమనం

అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమా చెలి ఏదని
నన్నే మరిచా తన పేరునె తలిచా
మదినే అడిగా తన ఊసేదని

నువ్వే లేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోను వెతికితే మనకథే
 
నీలోనె ఉన్న నిను కోరి ఉన్న
నిజమై నడిచా జతగా....

ఓ ఓ ఓ....

 

2 comments:

అవునండీ సూపర్ హిట్టు పాట... థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.