మిత్రులందరకూ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు ఆ గణనాథునికి నమస్కరించుకుంటూ శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు గానం చేసిన ఓ చక్కని భజనను తలచుకుందాం. ఈ భజన ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
ఆల్బమ్ : నామార్చన (2008)
సంగీతం, సాహిత్యం, గానం :
శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ
గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం
గణం గణం బీ జగమె గణం
అణువుల జీవుల గణం గణం
మూలాధారము జీవగణం
స్వాధిష్ఠానము సస్యగణం
మణిపూరము సం పదల గణం
అనాహతంబది వాయు గణం
గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం
విశుద్ధ మనగా విబుధ గణం
ఆజ్ఞా చక్రము శక్తి గణం
సహస్ర పద్మము తత్త్వ గణం
ఇక పై మిగిలిన దేమి గణం
గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం
గోళాలన్నీ అణు గణము
ఆకాశమంతా లోకగణం
ఈ గణపతిగణ మణి ఘృణిలో
సచిదానందుని గుణమగుణం
గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం
2 comments:
స్వామీజీయే మాకు అన్నీ..వారి భజన మీరు షేర్ చేసినందుకు చాలా సంతోషం గా ఉందండి..వినాయక చవితి శుభాకాంక్షలు..
థాంక్స్ పర్ ద కామెంట్ శాంతి గారు.. మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.