శనివారం, సెప్టెంబర్ 21, 2019

వెండిమబ్బు తేరు మీద...

డ్యుయెట్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : డ్యుయెట్ (1994)
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : వెన్నెలకంటి 
గానం : బాలు

వెండిమబ్బు తేరు మీద
ప్రేమ దేవత చేరవచ్చిందే
గుండెలోని మూగ ప్రేమ
చూసి నన్నే కోరి వచ్చిందే
నిదురించే ఎదలోన రాగం ఉందీ
నా కలనైనా కనరాని అనుబంధం ఉంది

వెండిమబ్బు తేరు మీద
ప్రేమ దేవత చేరవచ్చిందే  


నను నిందించే తమ్ముని
నా మూగ బాధే చూడనీ
నే వేడుతున్నా వీడిపోని బంధమేదనీ
నను నిందించే తమ్ముని
నా మూగ బాధే చూడనీ
నే వేడుతున్నా వీడిపోని బంధమేదనీ

నిదురించే ఎదలోన రాగం ఉందీ
నా కలనైనా కనరాని అనుబంధం ఉంది

వెండిమబ్బు తేరు మీద
ప్రేమ దేవత చేరవచ్చిందే  


ఆశలతో ఊసులతో నీకోసం వేచా
నా గుండెలలో కోవెలలో
నిను దేవిని చేశా
కత్తి వంటి కళ్ళతోటి
గాయం చేసి మాయం చేసిందే

నను నిందించే తమ్ముని
నా మూగ బాధే చూడనీ
నే వేడుతున్నా వీడిపోని బంధమేదనీ


తన చెవికైనా చేరేనా ఈ మూగ పిలుపే
ఇక కలనైనా తీరేనా నా పేద వలపే
ఎదురు చూసే ప్రేమ గాధ
మొదలు కాక ముగిసిపోయేనా

నను నిందించే తమ్ముని
నా మూగ బాధే చూడనీ
నే వేడుతున్నా వీడిపోని బంధమేదనీ 


4 comments:

థాంక్యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సర్. వికీని చూసి అదే కరెక్టనుకుని పెట్టాను. ఇపుడు అప్డేట్ చేశానండీ.

ఈ మూవీ లో ఆన్ని సాంగ్స్ అద్భుతం గా ఉంటాయి..

అవునండీ.. నిస్సందేహంగా.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.