దేవదాసు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
చిత్రం : దేవదాసు (1953)
సంగీతం : సి.ఆర్. సుబ్బరామన్
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : ఘంటసాల, కె. రాణి
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే ..
ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే ..
మిగిలిందీ నీవేనే...
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే
చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే
చేరదీసి సేవచేసే తీరూ కరువాయే..
చేరదీసి సేవచేసే తీరూ కరువాయే..
నీ దారే వేరాయే...
చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే
మరపురానీ బాధకన్నా మధురమే లేదూ
మరపురానీ బాధకన్నా మధురమే లేదూ
గతము తలచీ వగచేకన్నా సౌఖ్యమే లేదూ
గతము తలచీ వగచేకన్నా సౌఖ్యమే లేదూ
అందరానీ పొందుకన్నా అందమే లేదూ
ఆనందమే లేదు
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే
వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే
రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే
రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే
దారిలేని బాధతో నేనారిపోయేనా
కథ తీరిపోయేనా
చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే
ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే..
మిగిలిందీ నీవేనే
2 comments:
మనసుని కదిలించే పాట..
అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.