మల్లీశ్వరి చిత్రంలోని ఒక చక్కని విరహ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మల్లీశ్వరి (1954)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : ఘంటసాల, భానుమతి
ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు
దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు
ఏడ తానున్నాడో బావా
జాడ తెలిసిన పోయి రావా
అందాల ఓ మేఘమాల ఆఆ ..
అందాల ఓ మేఘ మాల
గగన సీమల తేలు ఓ మేఘమాలా
మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైన నాతో
మనసు చల్లగా చెప్పిపోవా
నీలాల ఓ మేఘమాలా ఆఆ
రాగాల ఓ మేఘమాలా
మమతలెరిగిన మేఘమాలా
నా మనసు బావకు చెప్పి రావా
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు
ఎదురు తెన్నులు చూచెనే బావకై
చెదరి కాయలు కాచెనే ఏఏ …
నీలాల ఓ మేఘమాలా ఆఆ…
రాగాల మేఘమాలా
మనసు తెలిసిన మేఘమాలా
మరువలేనని చెప్పలేవా
మల్లితో మరువలేనని చెప్పలేవా
కళ్ళు తెరచిన గాని
కళ్ళు మూసిన గాని
మల్లి రూపే నిలిచెనే
నా చెంత మల్లి మాటే పిలిచెనే
జాలి గుండెల మేఘమాలా
బావ లేనిది బ్రతుక జాల
జాలి గుండెల మేఘమాలా
కురియు నా కన్నీరు
గుండెలో దాచుకుని
వాన జల్లుగ కురిసి పోవా
కన్నీరు ఆనవాలుగా బావ బ్రోల
3 comments:
భానుమతిగారంటే మాకు చాలా ఇష్టం..వన్ ఆఫ్ హెర్ ఎవ్వర్ గ్రీన్ మెలొడీ..
తనకు సాటి రాగలవారెవ్వరూ లేరండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..
"వన్ ఆఫ్ హెర్ ఎవ్వర్ గ్రీన్ మెలొడీ.."
ఏమనుకోకండి శాంతి గారు వన్ ఆఫ్ అన్నప్పుడు చివర్లో బహువచనం వాడాలి. ఉదాహరణకు వన్ ఆఫ్ హర్ ఎవ్వర్ గ్రీన్ మెలొడీస్ అనాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.