బుధవారం, ఏప్రిల్ 03, 2019

ఈ సరిగమ సరదా...

మాస్టర్ తరుణ్ నటించిన తేజ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ జ్యూక్ బాక్స్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : తేజ (1992)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : చిత్ర, సునంద 

ఈ సరిగమ సరదా యాత్రలో
మీ మెదడుకు పదునే పెట్టనా
ఈ పరుగులు తీసే వయసులో
మన చదువుల మర్మం తెలుపనా
కొత్త టెక్నిక్కులెన్నో ఉన్న పిక్నిక్
పాటల్లోనా చదువుకో లోకమే
పాఠశాల కన్నా ఆటపాట మిన్న
విజ్ఞాన వీధిలో...

ఈ సరిగమ సరదా యాత్రలో
మీ మెదడుకు పదునే పెట్టనా

ఋతువుల రాణీ ఆమని
పరుగుల రాణీ అశ్వినీ
స్త్రీ కాని ఓ స్త్రీ ఉన్నదీ
క్రికెట్ లో ఎవరదీ ఎనిబడీ
మనదేశానికి పేరుతెచ్చిన ఆటల మేస్త్రీ
ఒకే ఓవర్లో సిక్స్ సిక్సర్లు కొట్టిన రవిశాస్త్రీ

ఈ సరిగమ సరదా యాత్రలో
మీ మెదడుకు పదునే పెట్టనా

పేరులోనా అది పసిదనిపించూ
ఏరియాలో అది భూమిని మించూ
ఖర్మగాలి అది పొంగి వచ్చెనా
కొంపలన్ని ముంచూ
ఏదా సాగరం చెప్పుకోండి వేగిరం
హిందూ మహాసముద్రం... నోనోనో..
అట్లాంటిక్కు ఇట్లాంటిక్కు
అన్నిటినీ దిగదొక్కు
ఆ సముద్రమే పసిఫిక్కూ.. 

ఈ సరిగమ సరదా యాత్రలో
మీ మెదడుకు పదునే పెట్టనా

దేహమన్నదే దేవాలయమని
అన్నది మన వేదం
కాదు కాదు విశ్వమన్నది
మా నవ విజ్ఞానం
ఎంత చిత్రమో చూశారా
ఎందువల్లనో చెబుతారా
ఊహూ మా వల్ల కాదు బాబూ
206 ఎముకల అస్తిపంజరం ఈ దేహం
అరవై వేల మైళ్ళ పొడవున్న రక్తనాళం
నరుడే నడిచే భూగోళం
నమ్మకపోతే గందర గోళం

ప్రతీ ప్రాణికీ చెట్టూ పిట్టకీ తప్పని విధి ఏదీ
కలిసి కట్టుగా మెలిసి జట్టుగా చేసే పని ఏదీ
నిదురపోయినా మెలకువొచ్చినా
ఎదగడం వయసు పెరగడం
 

2 comments:

తరుణ్ హీరోగా మంచి సక్సెస్ లు ఉన్నా యెందుకనో రాణించలేదనిపిస్తుంది..

నిజమేనండీ.. ఒక ఫేజ్ తర్వాత ఇక అందరు హీరోలు అలా ఐపోతారేమో.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.