బుధవారం, ఏప్రిల్ 24, 2019

డబ్బు ఖర్చు పెట్టకుండ...

ఓ పిసినారి.. సారి సారి.. పొదుపరి తండ్రీకొడుకులు డబ్బు ఎలా ఆదా చేయాలో ఓ సరదా ఐన పాట రూపంలో చెప్తున్నారు మనమూ విందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం (1991)
సంగీతం : జె.వి.రాఘవులు
సాహిత్యం : జాలాది  
గానం : బాలు, చిత్ర  

ఒహోం ఒహోం ఓ ఒహోం ఒహోం
ఒహోం ఒహోం ఓ ఒహోం ఒహోం

డబ్బు ఖర్చు పెట్టకుండ
దాచుకోండి నాయనా..
ఖర్చులన్ని ఊరిమీద
వేసుకోండి నాయనా
పప్పు ఉప్పు చింతపండు
దండగయ్య నాయనా
పంపు నీళ్ళు తాగి
నువ్వు బతుకు నాయనా

డబ్బు ఖర్చు పెట్టకుండ
దాచుకోండి నాయనా..
ఖర్చులన్ని ఊరిమీద
వేసుకోండి నాయనా

ఒహోం ఒహోం ఓ ఒహోం ఒహోం
ఒహోం ఒహోం ఓ ఒహోం ఒహోం

పిడకతోనె వంట చేసుకోండి
ఊక ఇంకా చౌక అండీ..
పుల్లతోనె పళ్ళు తొంకోండీ
బూడిదైతే ఖర్చులేందీ..
గుడ్డి దీపంతొ సర్దుకు పోండి
వీధి దీపాల వెలుగుందీ..
లోభిగొప్పన్న సూత్రము నాది
యోగి వేమన్న మార్గము నాదీ

వీరిద్దరు దొందుకు దొందే
వీరి పిసినికి కలుగును పిచ్చే

డబ్బు ఖర్చు పెట్టకుండ
దాచుకోండి నాయనా..
ఖర్చులన్ని ఊరిమీద
వేసుకోండి నాయనా
పప్పు ఉప్పు చింతపండు
దండగయ్య నాయనా
పంపు నీళ్ళు తాగి
నువ్వు బతుకు నాయనా

డబ్బు ఖర్చు పెట్టకుండ
దాచుకోండి నాయనా..
ఖర్చులన్ని ఊరిమీద
వేసుకోండి నాయనా

ఒహోం ఒహోం ఓ ఒహోం ఒహోం
ఒహోం ఒహోం ఓ ఒహోం ఒహోం
 
పంచె చింపి లుంగీ కట్టమంటా
గోచి గుడ్డే పెట్టమంటా 
 
పేలికంటి గుడ్డ కట్టుకొచ్చా
వంత పాటే పాడవచ్చా వామ్మో
పైస పైసకి నువు పిసినారి
పైట వేయడంలో నే పిసినారి ఆహా.. 
మహ చక్కగ కుదిరెను జోడీ
మరి చెప్పయ్యో ఎప్పుడు పెళ్ళి

భలె బేరము తగిలెను కదరా
వీడి రోగము దీనితొ కుదరా

డబ్బు ఖర్చు పెట్టకుండ
దాచుకోండి నాయనా..
ఖర్చులన్ని ఊరిమీద
వేసుకోండి నాయనా
పప్పు ఉప్పు చింతపండు
దండగయ్య నాయనా
పంపు నీళ్ళు తాగి
నువ్వు బతుకు నాయనా

డబ్బు ఖర్చు పెట్టకుండ
దాచుకోండి నాయనా..
ఖర్చులన్ని ఊరిమీద
వేసుకోండి నాయనా

ఒహోం ఒహోం ఓ ఒహోం ఒహోం
ఒహోం ఒహోం ఓ ఒహోం ఒహోం
 ఒహోం ఒహోం ఓ ఒహోం ఒహోం
ఒహోం ఒహోం ఓ ఒహోం ఒహోం

 


2 comments:

భలే సరదా ఐన పాట ఇది..

హహహ అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.