సింధూర దేవి చిత్రంలోని ఒక పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : సింధూర దేవి (1991)
సంగీతం : శంకర్ గణేష్
సాహిత్యం : రాజశ్రీ
గానం :
గజ వదనా దేవరా మా తోడు నీవురా
చిన్నారులకందించు ఆశీర్వచనం
గజ వదనా దేవరా మా తోడు నీవురా
చిన్నారులకందించు ఆశీర్వచనం
నాతో నీవీదినం సాగాలి అనుక్షణం
పసివారితో కలిసి చేయి నర్తనం
పసివారితో కలిసి చేయి నర్తనం
నీ నీడ నేనై కలిసాగానా
నీ వెంట ఊరంతా ఊరేగనా
పాడేము మేమే ఆడేములే
ఇక చూడీవేళ కేరింతలే
గజ వదనా దేవరా మా తోడు నీవురా
చిన్నారులకందించు ఆశీర్వచనం
పొరుగింటి ఓపిన్నీ మా ఇంట మావారిదె వంట
సినిమాకి నే వెళితే మా వారు పట్టించుకోరంట
పొరుగింటి ఓపిన్నీ మా ఇంట మావారిదె వంట
సినిమాకి నే వెళితే మా వారు పట్టించుకోరంట
పండగ చీరా కోరేనంటే పెద్దాపురం వెళ్ళి తెస్తారమ్మా
ఆలుమగల మధ్య పొత్తు కలిసెనే
అంతులేని ప్రేమ వెల్లి విరిసెనే
ఆలుమగల మధ్య పొత్తు కలిసెనే
అంతులేని ప్రేమ వెల్లి విరిసెనే
రాతిరేళ కానీ అది పగలే కానీ
రాతిరేళ కానీ అది పగలే కానీ
చేసుకున్న వాడు ఎన్ని మాటలననీ
మనకు చాలు బేబీ షామిలి
ఆ సినిమా ఉంటే చూస్తా మ్యాటినీ
ఆ సినిమా ఉంటే చూస్తా మ్యాటినీ
ఎందుకంట సినిమా అది పిచ్చి నీకుభామ
వంట చేయవమ్మ లేదంటే ఫక్కురమ్మా
2 comments:
షామిలి చిన్నప్పుడే అందం గా ఉందండీ..
అవునండీ అప్పట్లో సూపర్ స్టార్ కదా చైల్డ్ ఆర్టిస్ట్స్ లో.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.