సోమవారం, ఏప్రిల్ 01, 2019

ఆగిపో బాల్యమా...

వేసవి అనగానే మావిళ్ళు, మల్లెపూలతో పాటు శలవులతో ఇంట్లోనే ఉండి ఇరవై నాలుగు గంటలు సందడి చేసే చిన్నారులూ గుర్తొస్తారు కదా. అందుకే ఈ నెల పిల్లల పాటల సిరీస్. ముందుగా మహానటి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మహానటి (2018)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : రమ్య బెహ్రా

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
ఏటిలో వేగమా పాటలో రాగమా 
 
చిటికెల తాళాలు వేద్దాం
ఇంతలో వెళిపోకుమా
వెంట వచ్చే నేస్తమా
ఇంతలో వెళిపోకుమా
వెంట వచ్చే నేస్తమా
తొందరగా నన్నే పెంచేసి
నువ్వేమో చినబోకుమా

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
ఏటిలో వేగమా పాటలో రాగమా

ఊరికే పనిలేకా తీరికస్సలు లేక
తోటలో తూనీగల్లే తిరిగొద్దామా ఎంచక్కా
అంతపొడుగెదిగాక తెలుసుకోలేనింకా
సులువుగా ఉడతల్లే చెట్టెక్కే ఆ చిట్కా
నింగికి నిచ్చెన వెయ్యవే
నింగికి నిచ్చెన వెయ్యవే
గుప్పెడు చుక్కలు కొయ్యవే
హారం అల్లే రేపటి మెళ్ళో వెయ్యవే
నీ పిలుపే అందీ నలువైపుల నుండీ
అర చేతుల్లో వాలాలే
నీమది కోరిన కానుకలన్నీ

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
ఏటిలో వేగమా పాటలో రాగమా


2 comments:

ఓ..పిల్లల సిరీసా..సేవ్ చేసుకుంటామండీ..

థాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.