ఈ రోజు ఎన్నికల సంధర్బంగా ఓటున్న ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్రలోభాలకూ లొంగక కుల మత ప్రాంతీయ వ్యక్తిగత అభిమానాలను పక్కన పెట్టి రాష్ట్ర మరియూ దేశ ప్రయోజనాలకూ అభివృద్ధికీ పెద్ద పీట వేసి నిజాయితీతో విచక్షణతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీరు వేసే ఓటు రాబోయే రోజుల్లో మీతో ఈ "ముల్లు పోయి కత్తి వచ్చె ఢాం ఢాం" అని పాడించేలా కాకుండా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేస్తారని ఆశిస్తూ. మిస్టర్ పెళ్ళాం చిత్రంలోని ఈ సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.

చిత్రం : మిస్టర్ పెళ్ళాం (1993)
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు
ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం
మమ్మీ పోయి డాడీ వచ్చే ఢాం ఢాం ఢాం
పెన్ను పోయి గరిటె వచ్చే ఢాం ఢాం ఢాం
ఇదే కొత్త కింగ్ డం ఢాం
ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం
మమ్మీ పోయి డాడీ వచ్చే ఢాం ఢాం ఢాం
పెన్ను పోయి గరిటె వచ్చే ఢాం ఢాం ఢాం
ఇదే కొత్త కింగ్ డం ఢాం
అంట్లు తోమే ఆడది జెంట్స్ కు లోకువ చూడు
గాజులు తొడిగే శ్రీమతి పోజులు చెల్లవు నేడు
బట్లర్ పని నే చేసినా హిట్లర్ నేనని తెలుసా
ఆలుమగల యాత్రలో అప్పర్ బెర్త్ నే పరిచా
సమాన హక్కులంటే ఆ సమాధి లోపలంట
మగాడి నీడలోనే స్త్రీలకి ఉగాది ఉన్నదంట
భీముడల్లె వంట ఇంట కాముడల్లె పడకటింట
ఆడవాళ్లనేలుకోని కోడెగాడు
ఎందుకంట ఢాం ఢాం ఢాం
ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం
మమ్మీ పోయి డమ్మీ వచ్చే ఢాం ఢాం ఢాం
ఏయ్ మమ్మీ పోయి డాడీ వచ్చే ఢాం ఢాం ఢాం
పెన్ను పోయి గరిటె వచ్చే ఢాం ఢాం ఢాం
ఇదే కొత్త కింగ్ డం ఢాం
2 comments:
పాటే కాదు మెసేజ్ కూడా బావుంది..
థాంక్స్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.