సోమవారం, ఏప్రిల్ 08, 2019

అందాల అపరంజి బొమ్మా...

ఘటోత్కచుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఘటోత్కచుడు (1995)
సంగీతం : ఎస్వీకృష్ణారెడ్డి   
సాహిత్యం : సిరివెన్నెల  
గానం : బాలు

అందాల అపరంజి బొమ్మ
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మ
కడుపార నిను కన్న అమ్మ
చూడలేదమ్మ నీకంటి చెమ్మ
తను మరుగునున్నా
నిన్ను మరువదమ్మా
కన్నీరు తుడిచే కబురంపెనమ్మ
చెబుతాను వినవమ్మ.

అందాల అపరంజి బొమ్మ
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మ

ఆకలందంటే ఆ చిన్ని బొజ్జ
అడగకుండానే తెలుసుకోమంది
ఆటాడుకోగా తోడెవ్వరంటే
అంబారిగట్టి ఆడించమంది
నీకేం కావాలన్నా
నాకు చెపుతూ ఉంటానంది
తానే లోకాన్నున్నా
నిన్ను చూస్తూ ఉంటానంది
కాపాడుకుంటా కనుపాపలాగా
నిను చూసుకుంటా మీ అమ్మలాగా
నమ్మమ్మ నా మాట..

అందాల అపరంజి బొమ్మ
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మ

మావయ్యనంటూ నిను చేరమంది
మంచి మాటలతో మరిపించమంది
కథలెన్నొ చెప్పి నవ్వించమంది
ఒడిలోన చేర్చి ఓదార్చమంది
జో జో పాపా అంటూ
తాను రోజూ పాడే లాలి
ఇట్టా పాడాలంటూ
నాకు తానే నేర్పింది తల్లి
మా పాపనెప్పుడు కాపాడమంటూ
దేవుణ్ణి అడిగి దీవెనలు తెచ్చే
పని మీద వెళ్ళింది..

అందాల అపరంజి బొమ్మ
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మ
కడుపార నిను కన్న అమ్మ
చూడలేదమ్మ నీకంటి చెమ్మ
తను మరుగునున్నా
నిన్ను మరువదమ్మా
కన్నీరు తుడిచే కబురంపెనమ్మ
చెబుతాను వినవమ్మ.

అందాల అపరంజి బొమ్మ
అమ్మ ఏదంటూ బెంగ పడకమ్మ

2 comments:

పిక్ సో క్యూట్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.