అభిమన్యుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అభిమన్యుడు (1984)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : సుశీల
ఆకేసి.. పప్పేసి.. బువ్వేసి.. నెయ్యేసి
నీకో ముద్ద.. నాకో ముద్ద
ఆకేసి.. పప్పేసి.. బువ్వేసి.. నెయ్యేసి
నీకో ముద్ద.. నాకో ముద్ద
ఆకలి తీరే పోయింది
అత్తారింటికి దారేది
ఇలా.. ఇలా.. ఇలా..ఆ..
ఇలా.. ఇలా.. ఇలా..
ఆకేసి.. పప్పేసి.. బువ్వేసి.. నెయ్యేసి
తనకో ముద్ద.. నాకో ముద్ద
ఆకేసి.. పప్పేసి.. బువ్వేసి.. నెయ్యేసి
తనకో ముద్ద.. నాకో ముద్ద
తినిపించువాడొచ్చే వేళయింది..
ఒళ్ళంతా కళ్ళుగా ఎదురొచ్చింది
ఇలా.. ఇలా.. ఇలా..ఆ..
ఇలా.. ఇలా.. ఇలా..
అతగడే జతగాడు అనుకున్నది
అనుకున్నదే కలలు కంటున్నది
అతగాడే జతగాడు అనుకున్నది
అనుకున్నదే కలలు కంటున్నది
కలలోని విందు... కనులవిందవునా
కలలోని విందు... కనులవిందవునా
మనసులోని ఆశ... మాంగళ్యమౌనా
ఇలా... ఇలా... ఇలా..ఆ..
ఇలా... ఇలా... ఇలా
ఆకుంది పప్పుంది
బువ్వుంది నెయ్యుంది
ఆకలి ఉంది..ఆశా ఉంది
ఆకుంది పప్పుంది
బువ్వుంది నెయ్యుంది
ఆకలి ఉంది..ఆశా ఉంది
తినిపించే చల్లని చేయుంది
తినిపించే చల్లని చేయుంది
బ్రతుకంతా నడిపించే తోడుంది
ఇలా... ఇలా... ఇలా..ఆ..
ఇలా... ఇలా... ఇలా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.