శుక్రవారం, ఏప్రిల్ 05, 2019

అనగనగా ఒక ఊరు...

హలో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ పాట ఇవే లిరిక్స్ తో శ్రేయ పాడిన వర్షన్ కూడా ఉంది పైన ఇచ్చిన ఆడియో లింక్ లో వినవచ్చు.


చిత్రం : హలో (2017)
సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : చంద్రబోస్
గానం : శ్రీధృతి 

అనగనగా ఒక ఊరు
అనుకోకుండ ఒక నాడు
కలిసారే పసివాళ్లు స్నేహంగా
సంతోషమంత రెక్కలుగా
రివ్వంటు ఎగిరే పక్షులుగా
ఆకాశమంత ఆటాడుకుంటూ
ఉన్నారు సరదాగా

ఒకరేమో సీను ఒకరేమో జున్ను
కలిసారే ప్రాణంగ కురిసారె వర్షంగ
పాటేమో సీను ఆటేమో జున్ను
ఒకటై ఎదిగారే మధురంగ

ప్రపంచమంత తమ ఇల్లంటు
ప్రతి క్షణం ఒక పండుగగా
కన్నీరు లేని కలలే కంటూ
చిన్నారి చెలిమే బలపడగా

తియ తియ్యని ఊసులతో
తెల్ల తెల్లని మనసులలో
కథ ఇలాగా మొదలయ్యేగా
కథ ఇలాగా మొదలయ్యేగా

అనగనగా ఒక ఊరు
అనుకోకుండ ఒక నాడు
కలిసారే పసివాళ్ళు స్నేహంగా

ఎగిరిన బుడగలలోన చెలిమే
ఉరికిన పడవలలోన చెలిమే
రంగుల రాట్నంలో చెలిమే
చిందులు వేసిందే
మిణుగురు వెలుగులలోన చెలిమే
తొలకరి తేనెలలోన చెలిమే
గాజుల గలగలలో చెలిమే
సందడి చేసిందే
 
ఈ జ్ఞాపకాలన్నీ నిలిచేనులే
ఈ జీవితానికి బలమై నడిపేనులే
ఈ సాక్ష్యాలే అనుబంధాల
భవనానికి స్తంభాలే

అనగనగ ఒక ఊరు
అనుకోకుండ ఒక నాడు
కలిసారే పసివాళ్లు స్నేహంగ

తెలపని కబురులలోన చెలిమే
తిరగని మలుపులలోన చెలిమే
దొరకని చేపలలో చెలిమే
దోసిలి నింపిందే
జరిగిన నిమిషములోన చెలిమే
ఎరగని మరు నిమిషాన చెలిమే
కాలం చెక్కిలిలో చెలిమే
చుక్కై మెరిసిందే 

చిననాడు మురిపించే ఈ గురుతులే
కనరాని దారిని చూపే మీ గురువులే
ఉండాలంటూ ఈ బతుకంతా
మాటలకి కట్టుబడి


2 comments:

మూవీ కంటే పాటే బావుందండీ..

హహహహ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.