లిటిల్ హార్ట్స్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : లిటిల్ హార్ట్స్ (2001)
సంగీతం : చక్రి
సాహిత్యం : కులశేఖర్
గానం : చక్రి, కౌసల్య, మాస్టర్ ప్రదీప్
ఆ పసిప్రాణం నిలిచిందంటే
మీ చలవేగా మాస్టారూ
ఆయువు పోసే గుణముందంటే
దేవుడు మీరే మాస్టారూ
ఆనందమే మా సొంతమే
ఆనందమే మా సొంతమే
అంబరమందుకొంటు పాడాలి ఖవ్వాలీ
అందరమొక్కటంటు తుళ్ళింత లవ్వాలీ
అంబరమందుకొంటు పాడాలి ఖవ్వాలీ
అందరమొక్కటంటు తుళ్ళింత లవ్వాలీ
మనసే ఆశల పల్లవి పలికే కమ్మని స్వరమై
పల్లవి పలికే కమ్మని స్వరమై
బ్రతుకే ఊహల నందన వనమై అందిన వరమై
నందన వనమై అందిన వరమై
హోలీ పండగ నేడేనంటు రంగులు జల్లాలి
లోకం మొత్తం మనదేనంటు సందడి చెయ్యాలి
హోలీ పండగ నేడేనంటు రంగులు జల్లాలి
లోకం మొత్తం మనదేనంటు సందడి చెయ్యాలి
ఆనందమే మా సొంతమే
ఎవరో తెలియని ఏకాకులను
దరిచేర్చుకొని పెంచారే
మనసూ మమతల మర్మం తెలిపి
మాధుర్యాన్నే పంచారే
ఏదో బంధం లేకుంటే
మాపై ఎందుకు మమకారం
అంతా మన వారనుకుంటే
ఎందుకు ఉండదు అభిమానం
నడిచే దైవం వరముగ దొరికెను
మనసులు మురిసెను
వరముగ దొరికెను మనసులు మురిసెను
ఎదలో భావం పదములు తొడిగెను
కవితలు చదివెను
పదములు తొడిగెను కవితలు చదివెను
హోలీ పండగ నేడేనంటు రంగులు జల్లాలి
లోకం మొత్తం మనదేనంటు సందడి చెయ్యాలి
హోలీ పండగ నేడేనంటు రంగులు జల్లాలి
లోకం మొత్తం మనదేనంటు సందడి చెయ్యాలి
ఆనందమే మా సొంతమే
కాకుల ఒడిలో పెరిగిన కోయిల
ఆమని చెంతకు చేరిందే
ఆమని మామిడి చిగురులు పంచి
తియ్యని రాగం నేర్పిందే
కోయిల గానం వింటుంటే
కాలం ఎంతో తెలిసేనా
ఆమని తోడే లేకుంటే
కోయిల గొంతే పలికేనా
నీతో స్నేహం తపముకు
దొరకని వరమని తెలిసెను
తపముకు దొరకని వరమని తెలిసెను
నీ అనురాగం మధువులు చిలికెను
మనసులు తడిసెను
మధువులు చిలికెను
మనసులు తడిసెను
హోలీ పండగ నేడేనంటు రంగులు జల్లాలి
లోకం మొత్తం మనదేనంటు సందడి చెయ్యాలి
హోలీ పండగ నేడేనంటు రంగులు జల్లాలి
లోకం మొత్తం మనదేనంటు సందడి చెయ్యాలి
ఆనందమే మా సొంతమే
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.