శనివారం, ఏప్రిల్ 13, 2019

ఏమని తెలిపేది...

ఇల్లాలు ప్రియురాలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఇల్లాలు ప్రియురాలు (1984)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

ఏమని తెలిపేది
నేనెవరని చెప్పేది
ఏమని తెలిపేది
నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి
ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా.. ఏమని.. ఏమని


ఏమని తెలిపేది
నేనెవరని చెప్పేది


నా బాధ ఇంక తీరేనా
ఆ గాధ నీకు తెలిసేనా
నీ కంటి లేత కన్నీళ్ళు
నా చేతులార తుడిచేనా
మమతే.. మరచి..
ఇక నాలోన నే దాగనా
మూగవీ ఆశలు
గుడ్డివీ ప్రేమలు
జాలిగా చూడకు
అలా.. చూడకు.. చూడకు

ఏమని తెలిపేది
నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి
ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా.. ఏమని.. ఏమని
ఏమని తెలిపేది
నేనెవరని చెప్పేది

  
అనుకోని ఘటన ఆనాడు
అందించె నిన్ను ఈనాడు
మా దీపమై నీవు వస్తే
ఈ కోవెలే తలుపుమూసే
బ్రతుకే.. అలిగే..
ఈ బంధాల కోభారమై
సాగనీ జాతకం
ఆడనీ నాటకం
జాలిగా చూడకు
అలా.. చూడకు.. చూడకు

ఏమని తెలిపేది
నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి
ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా.. ఏమని.. ఏమని 

2 comments:

చైల్డ్ ఆర్టిస్ట్ అర్జున్ అనుకుంటాకదా..భలే చక్కగా ఉండేవాడా బాబు..

అవునండీ తన పేరు అర్జునే.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.