సోమవారం, ఏప్రిల్ 15, 2019

తనదు వరసత్వమును...

శృతిలయలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శృతిలయలు (1987)
సంగీతం : కె.వి.మహదేవన్ 
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, సుశీల  

జానకీ కాంత స్మరణం
జయ జయ రామ్..
హరనమః పార్వతీ పతయే..
హర హర మహాదేవ్..
శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభా..
శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభా..
శరణు శ్రీసతి వల్లభా..
శరణు రాక్షస గర్వ సంహర
శరణు రాక్షస గర్వ సంహర
శరణు వేంకట నాయక
శరణు వేంకట నాయక
స్వామి శ్రీ రఘునాయకా
శరణు శరణూ.. హరే...

తనదు వరసత్వమును
వారసత్వముగనిడి
తనువిచ్చు తండ్రికిదే తొలి వందనం
తండ్రికిదే తొలి వందనం

మమతానురాగాల కల్పతరువై
మంచిచెడు నేర్పించు మొదటి గురువై
ముక్కోటి వేల్పులను ఒక్క రూపున జూపు
మాతృపద పద్మములకిదె వందనం..
వందనం.. వందనం..

నటరాజ చరణాబ్జ సంసర్గ పరిపూత
నాట్య నిగమము దాల్చు రంగస్థలీ మాత 
తక ఝణుత తథిగిణత
తోం తకిట తక తకిట
జతుల సుమ గతులతో
అభివందనం అభివందనం
అభివందనం...

సాసాస సగ సగ సనీనీ 
సపనీస గసగమప మాగా
గమపనిప నీసా
గమపనిప గామా
సపమ సమగ సమగా
సగసనిప నీసాససా..

సాగెనే నాట్య వేదం
దిశల మ్రోగెనే ప్రణవ నాదం
సాగెనే నాట్య వేదం
దిశల మ్రోగెనే ప్రణవ నాదం
శంభుని పదాంబుజమ్ముల స్పర్శకు 
కుంభిని ముదాంబుధిగ నుప్పొంగగ
సాగెనే సాగెనే వేదం.. నాట్యవేదం

భం..భంభం..భంభం..భంభం..
గిరి కందరములె శంఖములై
నినదించే పటు నిర్ఘోషం
ఢమఢమ ఢమఢమ ఢమఢమ
జలద పటలముల
ఢమరుధ్వనముల
చెలగే నీలాకాశం

ధిమిధిమిధిమిధిమి ధింతకధిమ్మను
అభంగ తరంగ మృదంగ స్వరముల
నిలింప ఝురీ విలాసం 
నటుల జతుల పటహాదివాద్యతతి
చటల జటల చరళాడు తటిద్యుతి
ధరాధరాత్మజ సహానువర్తిగ  
సురాళి నుతించ స్వరారి ఘటించ
సాగెనే సాగెనే సాగెనే నాట్యవేదం
దిశల మ్రోగెనే ప్రణవ నాదం.. 
 
ఓం నమశ్శివాయా..

ఈశానస్సర్వ విద్యానామీశ్వర స్సర్వభూతానాం
బ్రహ్మాధిపతిర్-బ్రహ్మణోஉధిపతిర్-బ్రహ్మా
శివో మే అస్తు సదా శివోమ్ |


2 comments:

పాటకి సరిపోయే పిక్ అండీ..

థాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.