బాలభారతం చిత్రంలోని ఒక చక్కని పాటతో ఈ నెల పిల్లల పాటల సిరీస్ ను ముగిద్దాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : బాలభారతం (1972)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఎ.ఆర్.ఈశ్వరి
భలె భలె భలె భలె పెదబావ
భళిర భళిర ఓ చిన్నబావా
కనివిని ఎరుగని విడ్డూరం
సరిసాటిలేని మీ ఘనకార్యం
భలె భలె భలె భలె పెదబావ
భళిర భళిర ఓ చిన్నబావా
మీరు నూరుగురు కొడుకులు
ఆహ మారు మ్రోగు చలి పిడుగులు
మీరు నూరుగురు కొడుకులు
ఆహ మారు మ్రోగు చలి పిడుగులు
మట్టితెచ్చి గంభీర గుట్టలేసి
జంభారి పట్టపేన్గు
బొమ్మచేయు ఘటికులు
ఆహా జంభారి పట్టపేన్గు
బొమ్మచేయు ఘటికులు
వీరాధివీరులైన, శూరాతి శూరులైన
మీ కాలి గోటికి చాలరు
భలె భలె భలె భలె పెదబావ
భళిర భళిర ఓ చిన్నబావా
దైవమేది వేరు లేదు తల్లికంటె..
ఆ తల్లి కోర్కె తీర్చువారె బిడ్డలంటె
ఏ తల్లి నోచలేదు ఇంతకంటె
ఆహా ఏ తల్లి నోచలేదు ఇంతకంటె
ఈ మాటకల్ల కాదు
ఈ రేడు జగములందు
మీలాంటివాళ్ళు ఇంక పుట్టరంటే
భలె భలె భలె భలె పెదబావ
భళిర భళిర ఓ చిన్నబావా
మేళాలు తాళాలు ముత్యాల ముగ్గులు
రతనాల గొడుగులు సంబరాలు
ఆ మేళాలు తాళాలు ముత్యాల ముగ్గులు
రతనాల గొడుగులు సంబరాలు
ఊరంత పచ్చని తోరణాలూ
వీరణాలూ తందనాలూ
ఊరంత పచ్చని తోరణాలూ
వీరణాలూ తందనాలూ
ఊరేగే వైభవాలు బంగారు వాయినాలు
ఆనందభరితమౌను జీవితాలు
భలె భలె భలె భలె పెదబావ
భళిర భళిర ఓ చిన్నబావా
కనివిని ఎరుగని విడ్డూరం
సరిసాటిలేని మీ ఘనకార్యం
2 comments:
నైస్ సిరీస్ వేణూజీ..
థాంక్స్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.