గురువారం, ఏప్రిల్ 04, 2019

పాపా పాడే పాటా...

లక్ష్మీ దుర్గ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లక్ష్మీ దుర్గ (1991)
సంగీతం : శంకర్ గణేశ్ 
సాహిత్యం : రాజశ్రీ
గానం :

పాపా పాడే పాటా తెరగా నిలిచేనంటా
పాపా పాడే పాటా తెరగా నిలిచేనంటా
ముగ్గురమింకా ఒకటే కాదా
అమ్మకు మనమే కన్నులు కాదా
ఒకటై ఆడాలిలే..
పాపా పాడే పాటా తెరగా నిలిచేనంటా

కోయిలల్లే నే పాడితే మీకూ ఇష్టంరా
రాచిలకల్లె మాటాడితే మీకూ తెలుసురా
మనకింక సరిసాటి లేరె
ఏనాడు ఎడబాటు లేదే
మనలోన ఇంక తేడాలు లేక ఒకటై ఆడాలిలే

పాపా పాడే పాటా తెరగా నిలిచేనంటా
ముగ్గురమింకా ఒకటే కాదా
అమ్మకు మనమే కన్నులు కాదా
ఒకటై ఆడాలిలే..
పాపా పాడే పాటా తెరగా నిలిచేనంటా

నా స్నేహమే నీతోనులే
ప్రాణం నువ్వేనులే
నన్నే విడిచీ నువు సాగితే
నీకై వేచేనులే
వినగానె ఈ పాప పాటా
నా చెంత నిలవాలి అంతా
నోరార మనమే మాటాడకున్నా
మనసార మాటాడుదాం.

పాపా పాడే పాటా తెరగా నిలిచేనంటా
ముగ్గురమింకా ఒకటే కాదా
అమ్మకు మనమే కన్నులు కాదా
ఒకటై ఆడాలిలే.. ఒకటై ఆడాలిలే


2 comments:

చిన్నప్పుడే షామిలి క్యూట్ గా ఉందనిపిస్తుంది నాకు..

అవునండీ.. అప్పుడే ఎన్ని సినిమాలు వచ్చాయో కదా తనకి.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.