డాడీ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : డాడీ (2001)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : చంద్రబోస్
గానం : ఉదిత్ నారాయణ్, చిత్ర
వానా వానా తేనెల వానా
వానా వానా వెన్నెల వానా
కురవని కురవని నే నిలువునా కరగనీ
పాప కంటి చూపులలో
పాల పంటి నవ్వులలో
బాల మేఘ మాలికలో
జాలువారు తొలకరిలో
తడిసి తడిసిపోనీ
మది మురిసి మురిసిపొనీ
తడిసి తడిసిపోనీ
ముడి బిగిసి బిగిసిపొనీ
చిరు చిరు పలుకుల చినుకులలో
బిర బిర పరుగుల వరదలలో
తడిసి తడిసిపోనీ మది
మురిసి మురిసిపొనీ
వాన వాన తేనెల వానా
వాన వాన వెన్నెల వానా
ముంగిట్లో మబ్బే వచ్చే మనసులోన మెరుపొచ్చే
పన్నీటి చినుకే వచ్చే ప్రాణంలోన చిగురొచ్చే
బుల్లి బుజ్జి వాన దేవతొచ్చె
గుండె పైన నీళ్ళు చల్లి లాల పోసే నేడే
ఘల్లు ఘల్లు గాలి దేవతొచ్చె
జీవితాన ప్రేమ జల్లి లాలి పాట పాడే
ఒహో...శ్రావణాల రాణి వచ్చే
ఉన్న చీకు చింత చీకట్లన్నీ కడిగి
ఇంకా ఇంకా ఏం కావాలో అడిగే
మధురంగా కధే సాగుతుంటే
మన బెంగ ఇలా కరుగుతుంటే
వేగంగా కలే తీరుతుంటే
ఆ గంగ ఇలకు జారుతుంటే
తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపొనీ
పన్నీటి చినుకే వచ్చే ప్రాణంలోన చిగురొచ్చే
బుల్లి బుజ్జి వాన దేవతొచ్చె
గుండె పైన నీళ్ళు చల్లి లాల పోసే నేడే
ఘల్లు ఘల్లు గాలి దేవతొచ్చె
జీవితాన ప్రేమ జల్లి లాలి పాట పాడే
ఒహో...శ్రావణాల రాణి వచ్చే
ఉన్న చీకు చింత చీకట్లన్నీ కడిగి
ఇంకా ఇంకా ఏం కావాలో అడిగే
మధురంగా కధే సాగుతుంటే
మన బెంగ ఇలా కరుగుతుంటే
వేగంగా కలే తీరుతుంటే
ఆ గంగ ఇలకు జారుతుంటే
తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపొనీ
వానా వానా తేనెల వానా
వానా వానా వెన్నెల వానా
చిన్నతనం ముందరికొచ్చే పెద్దరికం మరుపొచ్చే
ఏటిగట్టు ఎదురుగ వచ్చే ఇసుక గుళ్ళు గురుతొచ్చే
కారు మబ్బు నీరు చిందుతుంటే కాగితాల పడవలెన్నో
కంటి ముందుకొచ్చే
నీటిలోన ఆట్లలాడుతుంటే అమ్మనోటి తీపి తిట్లు జ్ఞ్యాపకనికొచ్చే
ఒహో...పైట కొంగే గొడుగు కాగా
ఈ చోటు చోటు ఎంతో ఎంతో ఇరుకు
ఏమైందంటే నీకు నాకు ఎరుకే
ఒక్కటిగా ఇలా పక్కనుంటూ ఇద్దరమై సదా సర్దుకుంటూ
ముగ్గురిదీ ఒకే పాణమంటూ ముద్దులతో కధే రాసుకుంటూ
తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపొనీ
వానా వానా తేనెల వానా
వానా వానా వెన్నెల వానా
కురవని కురవని నే నిలువునా కరగనీ
పాప కంటి చూపులలో
పాల పంటి నవ్వులలో
బాల మేఘ మాలికలో
జాలువారు తొలకరిలోతడిసి తడిసిపోనీ
మది మురిసి మురిసిపొనీ
తడిసి తడిసిపోనీ
ముడి బిగిసి బిగిసిపొనీ
వానా వానా వెన్నెల వానా
కురవని కురవని నే నిలువునా కరగనీ
పాప కంటి చూపులలో
పాల పంటి నవ్వులలో
బాల మేఘ మాలికలో
జాలువారు తొలకరిలోతడిసి తడిసిపోనీ
మది మురిసి మురిసిపొనీ
తడిసి తడిసిపోనీ
ముడి బిగిసి బిగిసిపొనీ
2 comments:
ఈ పాప చాలా అందం గా ఉంటుంది..
అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.