శనివారం, ఏప్రిల్ 06, 2019

దరి జేర దీవించు...

మిత్రులందరకూ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ. ఈ పండగ రోజు సర్వంతాళమయం చిత్రం నుండి ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సర్వం తాళమయం (2019)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం : రాకేందు మౌళి
గానం : శ్రీరాం పార్థసారధి 

దరి జేర దీవించు
దయ జూపి కరుణించు
దరి జేర దీవించు
దయ జూపి కరుణించు
నీ జ్ఞానమే అందించూ
నా పాటే నువు ఆలకించూ
నా పాటే నువు ఆలకించూ ఓ సారి

దరి జేర దీవించు
దయ జూపి కరుణించు
నీ జ్ఞానమే అందించూ
నా పాటే నువు ఆలకించూ
నా పాటే నువు ఆలకించూ ఓ సారి

మన్నున మరుగైనా మరల జన్మించా
జ్ఞాన నేత్రము తొలిగా తెరిచా
మన్నున మరుగైనా మరల జన్మించా
జ్ఞాన నేత్రము తొలిగా తెరిచా
రెక్కలు తొడిగీ ఎగరగ వచ్చా...ఆఆఆఅ..

ఎగరగ వచ్చా 
దరిజేర దరిజేరా
దరి జేర దీవించూ

విత్తనాన వృక్షమై పలుకున భావమై
నీటిన అమృతమై శిలలో శిల్పమై
విత్తనాన వృక్షమై పలుకున భావమై
నీటిన అమృతమై శిలలో శిల్పమై
అణువున అఖిలమై నాలో సంగీతమై
నిను జూడగ నే దరి జేర..

దరి జేర దీవించు
దయ జూపి కరుణించు
నీ జ్ఞానమే అందించూ
నా పాటే నువు ఆలకించూ
నా పాటే నువు ఆలకించూ ఓ సారి
నా పాటే నువు ఆలకించూ

  

2 comments:

ఉగాది శుభాకాంక్షలు వేణూజీ..

థాంక్స్ శాంతి గారూ.. మీకు కూడా ఉగాది శుభాకాంక్శలు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.