చూడాలనివుంది చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : చూడాలనివుంది (1998)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం :
గానం : బాలు, చిత్ర
సింబలే సింబలే అంబరాలు అందెలే హాయిలే
బల్ బలే బల్ బలే చేతికందే మాకు వెండి మబ్బులే
వెన్నెలమ్మా వేటకొచ్చే ఏనుగమ్మ అంబారిలో
తేనెలమ్మా త్రేనుపొచ్చే మల్లెజాజి మందారిలో

చందమామా తీసుకొచ్చే సబ్బుబిళ్ల నేనులెమ్మనీ
చంద్రవంక వాగుపొంగే స్నానమాడ నిన్నురమ్మనీ
చంద్రవంక వాగుపొంగే స్నానమాడ నిన్నురమ్మనీ
పిల్లనెమలి సంబరం సింబలే సింబలే
పింఛమెంత సుందరం సింబలే సింబలే
పట్నమన్న పంజరం పట్టువీడి పావురం
పింఛమెంత సుందరం సింబలే సింబలే
పట్నమన్న పంజరం పట్టువీడి పావురం
ఈ గూటికొచ్చే కాపురం హొయిలాలో హొయిలాలో
సింబలే సింబలే అంబరాలు అందెలే హాయిలే
బల్ బలే బల్ బలే చేతికందే మాకు వెండి మబ్బులే
బల్ బలే బల్ బలే చేతికందే మాకు వెండి మబ్బులే
ఆకాశాలే నేలకొచ్చే మేడకన్నా నీడ మేలని
ఆనందాల వెల్లువచ్చి లాలపోసే కంటిపాపకి
చూడ చూడ వింతలు సింబలే సింబలే
చుక్కలేడి గంతులు సింబలే సింబలే
ఆనందాల వెల్లువచ్చి లాలపోసే కంటిపాపకి
చూడ చూడ వింతలు సింబలే సింబలే
చుక్కలేడి గంతులు సింబలే సింబలే
ఆకుపచ్చ పొద్దులు మాకులేవు హద్దులు
ఈ కొండకోన సీమలో హొయిలాలో హొయిలాలో
ఈ కొండకోన సీమలో హొయిలాలో హొయిలాలో
సింబలే సింబలే అంబరాలు అందెలే హాయిలే
బల్ బలే బల్ బలే చేతికందే మాకు వెండి మబ్బులే
బల్ బలే బల్ బలే చేతికందే మాకు వెండి మబ్బులే
వెన్నెలమ్మా వేటకొచ్చే ఏనుగమ్మ అంబారిలో
తేనెలమ్మా త్రేనుపొచ్చే మల్లెజాజి మందారిలో
తేనెలమ్మా త్రేనుపొచ్చే మల్లెజాజి మందారిలో
2 comments:
కన్యా కుమారీ(బొబ్బిలి రాజా) పాట తరవాత అలా సరదాగా అనిపించిన పాట..
అదే ఈ పాటకు ఇన్స్పిరేషన్ అయుండచ్చు శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.