మంగళవారం, ఏప్రిల్ 09, 2019

చిట్టి అమ్ములు...

అమ్ములు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అమ్ములు (2002)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్    
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : దరహాస్, సాధనా సర్గం, శ్రీకుమార్, శ్రీదేవి

చిట్టి అమ్ములు చిన్నినాన్నలూ
ముంగిటా ముత్యమోలె ఉన్నావే
వెండి నవ్వులే నువ్వు నవ్వితే
చంద్రుడే మోము దాచుకుంటాడే
గారాబాల ముద్దుకు రూపం
నీవేలే ఓ తల్లీ
చిట్టి అమ్ములు చిన్నినాన్నలూ
ముంగిటా ముత్యమోలె ఉన్నావే

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటీ
దాగుడు మూతా దండాకోరు వీరి పేరేంటీ
ఆకుపచ్చ గులాబి రంగు
అందరు అమ్ముల్ని పట్టుకోండీ

నెమలి చిన్నబోవులే నువ్వు ఆడుతుంటే
చిలక సిగ్గు పడునులే నువ్వు పలుకుతుంటే
కోకిలమ్మ అలకలు ఎందుకో నాకెరుకే
నీకు మల్లె పాటలూ పాడలేదు గనుకే
అంబారేనుగల్లే నిను మోసి మురిసిపోనా
అమ్మా అంటూ నిన్ను వెయి సార్లు పిలుచుకోనా
చిన్నారులే ఈ నేల హరివిల్లులే
మీ వలెనే గుండెల్లో విరిజల్లులే
ఇంటికి అందం పిల్లలతోనే వస్తుందమ్మా ఓ తల్లీ

చిట్టి అమ్ములు చిన్నినాన్నలూ
ముంగిటా ముత్యమోలె ఉన్నావే

కన్నవాళ్ళ కలలకు మీరే రూపమమ్మా
బతుకు పైన ఆశలూ మీతో పెరుగునమ్మా
పెరిగి పెరిగి మీరే పెద్దలవుదురమ్మా
తల్లిదండ్రి మళ్ళీ మీ పిల్లలవుదురమ్మా
కంటి పాపలోలే మము చూసుకుంటె అపుడు
అంతే మాకు చాలు ఇక ఏమీ కోరమిపుడు
కొడుకులింక మాకు వద్దమ్మడూ
ఈ జన్మకూ నీ తోడు చాలమ్మడూ
పాపల కళ్ళు దేవుడి గుళ్ళు
వర్ధిల్లమ్మా నువు నూరేళ్ళూ..

చిట్టి అమ్ములు చిన్నినాన్నలూ
ముంగిటా ముత్యమోలె ఉన్నావే 

2 comments:

ఈ పాట మొదటి సారి వింటున్నానండి..బానే ఉంది..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.