శుక్రవారం, ఏప్రిల్ 26, 2019

చలన చకిత జం...

లిటిల్ హార్ట్స్ చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లిటిల్ హార్ట్స్ (2001)
సంగీతం : చక్రి
సాహిత్యం : కులశేఖర్
గానం : సుధ

చలన చకిత జం చలన చకిత జం
చలన చకిత జం జం జం
చలన చకిత జం చలన చకిత జం
చలన చకిత జం జం జం
జగతి చరితలో భరత ఘనతని
పసిడి వన్నెతో రాద్దాం
ప్రగతి పధములో జగతి ప్రధములై
కలసి అడుగులే వేద్దాం
అంత ఒక్కటే మనమంత ఒక్కటే
ఎదలో కలలా ఎగసే అలలా
ఎదలో కలలా ఎగసే అలలా
సాగాలి నేడే పారే ఏరులా..

ఏళ్ళూ పూళ్ళూ గడచిన తరగని
వేద విధానం మనదేగా
కుళ్ళూ కుట్రా గట్రా ఎరగని
గొప్ప వివేకం మనదేగా
పంచమ వేదం మనదేగా
వంచన తగదని అనలేదా
పంచమ వేదం మనదేగా
వంచన తగదని అనలేదా
నిత్యం సత్యం చెప్పాలంటూ
నీతీ న్యాయం చుట్టాలంటూ
మానవ జీవన శైలిని తెలిపిన
అనుభవ ఖ్యాతిక మనదేగా

జగతి చరితలో భరత ఘనతని
పసిడి వన్నెతో రాద్దాం
ప్రగతి పధములో జగతి ప్రధములై
కలసి అడుగులే వేద్దాం

గాంధీ నెహ్రూ ఇందిర మొత్తం
ఇక్కడ పుట్టిన వారేగా
శాంతి నివాసపు సుందర స్వప్నం
చివురులు తొడిగినదిచటేగా
రాజ్యం భోజ్యం మనదేగా
రాజూ పేదా ఒకటేగా
రాజ్యం భోజ్యం మనదేగా
రాజూ పేదా ఒకటేగా
రామరాజ్యం మనదేనంటూ
ఇంతకు మించిన మంచేదంటూ
మానవ జీవన శైలిని తెలిపిన
అనుభవ ఖ్యాతిక మనదేగా

జగతి చరితలో భరత ఘనతని
పసిడి వన్నెతో రాద్దాం
ప్రగతి పధములో జగతి ప్రధములై
కలసి అడుగులే వేద్దాం
అంత ఒక్కటే మనమంత ఒక్కటే
ఎదలో కలలా ఎగసే అలలా
ఎదలో కలలా ఎగసే అలలా
సాగాలి నేడే పారే ఏరులా..

జగతి చరితలో భరత ఘనతని
పసిడి వన్నెతో రాద్దాం
ప్రగతి పధములో జగతి ప్రధములై
కలసి అడుగులే వేద్దాం


2 comments:

ఈ మూవీ యెప్పుడొచ్చిందీ తెలీదు..బట్ సాంగ్ బావుంది..

థియేటర్లలో పెద్దగా ఆడినట్లు లేదండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.