ఆదివారం, మార్చి 31, 2019

ఎక్కడో పుట్టి...

స్టూడెంట్ నంబర్ వన్ చిత్రంలోని ఒక చక్కని ఫేర్వెల్ పాటతో ఈ యూత్ సాంగ్స్ సిరీస్ ని ముగిద్దాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : స్టూడెంట్ నంబర్ 1  (2001)
సంగీతం : కీరవాణి  
సాహిత్యం : చంద్రబోస్
గానం : కీరవాణి 

ఆ.. ఆ.. ఆ..

ఓ మై డియర్ గర్ల్స్ .. డియర్ బోయ్స్ ..
డియర్ మేడమ్స్ .. గురుబ్రహ్మలారా ..

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటు వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము
చిలిపితనపు చివరి మలుపులో
వియ్ మిస్ ఆల్ ద ఫన్ 
వియ్ మిస్ ఆల్ ద జాయ్ 
వియ్ మిస్ యూ
వియ్ మిస్ ఆల్ ద ఫన్ 
వియ్ మిస్ ఆల్ ద జాయ్
వియ్ మిస్ యూ

నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలూ
సైన్సు లాబ్ లోనా షీలాపై చల్లిన ఇంకు చుక్కలూ
ఫస్ట్ బెంచ్ లోన మున్నీపై వేసిన పేపర్ ఫ్లైటులూ
రాధ జళ్ళోనుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బాండులూ
రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు
శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు
కైలాష్ కూసిన కాకి కూతలు
కళ్యాణి పేల్చిన లెంపకాయలు
మరపురాని తిరిగిరాని గురుతులండి
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ

అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి
ఆ అల్లరంటే మాక్కూడా సరదాలెండీ

వియ్ మిస్ ఆల్ ద ఫన్ 
వియ్ మిస్ ఆల్ ద జాయ్ 
వియ్ మిస్ యూ
వియ్ మిస్ ఆల్ ద ఫన్ 
వియ్ మిస్ ఆల్ ద జాయ్
వియ్ మిస్ యూ

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటు వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము
చిలిపితనపు చివరి మలుపులో

బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు జోకులూ
రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూపు సాంగులూ
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులూ
టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోక్ టిన్నులూ
బ్లాకుబోర్డు పైన గ్రీకు బొమ్మలు
సెల్లుఫోనుల్లోన సిల్లీ న్యూసులు
బాత్ రూముల్లోన భావకవితలు
క్లాస్ రూముల్లోన కుప్పిగంతులు
మరపురాని తిరిగిరాని గురుతులండి
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ

మనకు మనకు క్షమాపణలు ఎందుకండి
మీ వయసులోన మేం కూడా ఇంతేనండీ

వియ్ మిస్ ఆల్ ద ఫన్ 
వియ్ మిస్ ఆల్ ద జాయ్ 
వియ్ మిస్ యూ
వియ్ మిస్ ఆల్ ద ఫన్ 
వియ్ మిస్ ఆల్ ద జాయ్
వియ్ మిస్ యూ

2 comments:

బ్యూటిఫుల్ రౌండప్ ఫర్ యూత్ సాంగ్స్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.